
IND vs SA : అశ్విన్ లాగా బౌలింగ్ ట్రై చేసిన బుమ్రా.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా(Team India) సఫారీ గడ్డపై మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది.
బుధవారం నుంచి జరిగే ఆఖరిదైన రెండో టెస్టులో సౌతాఫ్రికాతో తలపడనుంది.
ఇక రెండో టెస్టు మ్యాచుకు ముందు మంగళవారం నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు శ్రమిస్తున్నారు.
ఇందులో భాగంగా భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) నెట్స్‌లో సహచరుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించాడు.
సేమ్ అశ్విన్ బౌలింగ్‌ను బుమ్రా అనుకరించి స్పిన్ బౌలింగ్ వేశాడు. ఫాస్ట్ బౌలర్ స్పిన్ బౌలింగ్ వేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై నెటిజన్లు అచ్చంలాగే అశ్విన్ లాగానే బుమ్రా బౌలింగ్ వేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అశ్విన్ లాగా బౌలింగ్ చేసిన బుమ్రా
Jasprit Bumrah is Ashwin 2.0 😅#TeamIndia #SAvIND #Bumrah #Ashwin #TestCricket #CricketTwitterpic.twitter.com/esf7TDkTP0
— Sujeet Suman (@sujeetsuman1991) January 2, 2024