LOADING...
IPL: స్టార్ ప్లేయర్ల సందడి.. ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మీట్..వీడియో వైరల్
స్టార్ ప్లేయర్ల సందడి.. ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మీట్..వీడియో వైరల్

IPL: స్టార్ ప్లేయర్ల సందడి.. ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మీట్..వీడియో వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 22, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అభిమానులతో కలసి ముంబయి ఇండియన్స్ జట్టు ఉత్సాహంగా సమయం గడిపింది. ప్రత్యేకంగా నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ కార్యక్రమంలో జట్టు ఆటగాళ్లు పాల్గొని అభిమానులను అలరించారు. ఈ ఈవెంట్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య తో పాటు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ప్రముఖ ఆటగాళ్లు పాల్గొని సందడి చేశారు. అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ, కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఫ్యాన్స్‌తో జతకట్టి ఆడిపాడారు ముంబయి ఇండియన్స్ ప్లేయర్లు.

వివరాలు

వీడియోలు వైరల్..

ఈ వేడుకలో సంగీత దర్శకుడు సంజు రాథోడ్ అందించిన లైవ్ కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన సంగీతానికి అభిమానులు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మిగిలిన జట్లు కూడా ఇలా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో: 

Advertisement