డేంజర్ జోన్‌లో వెస్టిండీస్.. నేటి నుంచే క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్
వన్డే వరల్డ్ కప్‌ను రెండుసార్లు ముద్దాడి, ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు డేంజర్ జోన్ లో ఉంది. క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్‌కు శ్రీలంక అర్హత సాధించగా, ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లలో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించడానికి ఆరు జట్లు బుధవారం నుంచి క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్‌లో పోటీ పడనున్నాయి. గ్రూప్ ఎ నుంచి జింబాబ్వే, వెస్టిండీస్, నెదర్లాండ్స్, గ్రూప్ బి నుంచి శ్రీలంక,ఒమన్, స్కాంట్లాండ్ ఈ సూపర్ సిక్స్‌కు అర్హత సాధించాయి. ఈ ఆరు జట్లలో రెండు జట్లు మాత్రమే వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. రెండు మాజీ ఛాంపియన్ జట్లు వెస్టిండీస్, శ్రీలంక సూపర్ 6 స్టేజీలో ఉండటంతో ఈటోర్నీ ఆసక్తి రేపుతోంది.
క్వాలిఫయర్ సూపర్-6 స్టేజ్ షెడ్యుల్ ఇదే
శ్రీలంక, జింబాబ్వే జట్లు నాలుగు పాయింట్లతో ప్రస్తుతం సూపర్ 6లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. స్కాంట్లాండ్, నెదర్లాండ్స్ కు రెండేసి పాయింట్లు, వెస్టిండీస్ ఒమన్ జట్లు సున్నా పాయింట్లు ఉన్నాయి. దీంతో వెస్టిండీస్ ఫైనల్ చేరాలంటే సూపర్ 6లో అన్ని మ్యాచుల్లోనూ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. క్వాలిఫయర్ సూపర్ 6 స్టేజ్ షెడ్యూల్ జూన్ 29: జింబాబ్వే v ఒమన్ జూన్ 30: శ్రీలంక v నెదర్లాండ్స్ జులై 1: స్కాట్లాండ్ vవెస్టిండీస్ జులై 2: జింబాబ్వే vశ్రీలంక జులై 3: నెదర్లాండ్స్ vఒమన్ జులై 4: జింబాబ్వే v స్కాట్లాండ్ జులై 5: వెస్టిండీస్ v ఒమన్ జులై 6: స్కాట్లాండ్ v నెదర్లాండ్స్ జులై 7: శ్రీలంక v వెస్టిండీస్