Top 10 Richest Sports Leagues: మోస్ట్ వాల్యాబుల్ స్పోర్ట్స్ లీగ్స్ జాబితాలో IPL స్థానం ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వినోదం పంచే ప్రముఖ రంగాల్లో క్రీడలు మొదటి స్థానంలో నిలుస్తాయి. క్రీడలపై ఆసక్తి చూపే అభిమానుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 2021లో గ్లోబల్ స్పోర్ట్స్ మార్కెట్ విలువ 486.61 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 నాటికి 512.14 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2026 నాటికి ఈ మార్కెట్ 700 బిలియన్ డాలర్లను చేరుకోనుంది. ప్రపంచంలో రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్‌లకు విపరీత ఆదరణ లభిస్తోంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా క్రీడల్లో తీసుకొస్తున్న నూతన మార్పులు మరింత వినోదాన్ని అందించనున్నాయి. ఈ క్రమంలో రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్‌లలో ఎవరెవరు ఉన్నారు. ఇందులో ఇండియా నుండి అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ ఏ స్థానంలో నిలిచిందో తెలుసుకుందాం.
1. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL)
1920లో ప్రారంభమైన అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ NFL 2023లో 13 బిలియన్ డాలర్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. 2027 నాటికి 25 బిలియన్ డాలర్ల లక్ష్యంతో ఈ లీగ్ వేగంగా ఎదుగుతోంది. 2. మేజర్ లీగ్ బేస్‌బాల్ (MLB) 1876లో ప్రారంభమైన MLB, 2023లో 11.34 బిలియన్ డాలర్ల ఆదాయంతో రెండవ స్థానంలో ఉంది. ప్రతి సీజన్‌లో 30 జట్లు 162 మ్యాచ్‌లు ఆడుతాయి. 3. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) 1946లో స్థాపించిన NBA, 2022-23 సీజన్‌లో 10.58 బిలియన్ డాలర్ల ఆదాయంతో మూడో స్థానంలో నిలిచింది.
4. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)
2008లో ప్రారంభమైన IPL, 2023లో 9.5 బిలియన్ డాలర్ల ఆదాయంతో రిచెస్ట్ క్రికెట్ లీగ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రపంచ టాప్ 10 స్పోర్ట్స్ లీగ్‌లలో ఐపీఎల్ నాలుగో స్థానంలో ఉంది. 5 ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (EPL) 1992లో ప్రారంభమైన EPL, 2022-23 సీజన్‌లో 7 బిలియన్ డాలర్ల ఆదాయం పొందింది. ఇది ఫిఫ్త్ రిచెస్ట్ లీగ్‌గా ఉంది. 6. నేషనల్ హాకీ లీగ్ (NHL) 1917లో ప్రారంభమైన NHL, గతేడాది 6.43 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో స్థానంలో నిలిచింది.
7. లా లిగా (LaLiga)
1929లో ప్రారంభమైన స్పెయిన్ ఫుట్‌బాల్ లీగ్, 5.69 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఏడవ స్థానంలో ఉంది. 8. బుండెస్లిగా (Bundesliga) జర్మన్ ఫుట్ బాల్ లీగ్ అయిన బుండెస్లిగా, 2022-23 సీజన్‌లో 4.4 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఎనిమిదవ స్థానంలో ఉంది. 9. UEFA ఛాంపియన్స్ లీగ్ 1955లో ప్రారంభమైన ఈ యూరోపియన్ ఫుట్‌బాల్ పోటీ, 3.2 బిలియన్ డాలర్ల ఆదాయం పొందింది. 10. సీరీ A (Serie A) ఇటలీ ఫుట్‌బాల్ లీగ్, 2022-23లో 2.9 బిలియన్ డాలర్ల ఆదాయంతో పదవ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రీడా లీగ్‌లలో ఇండియాకు చెందిన IPL ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.