
Team India: 'గెలిచినా, ఓడినా మేమంతా మీతోనే'.. టీమిండియాకు ప్రముఖుల మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.
ఈ క్రమంలో భారత జట్టుకు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలబడ్డారు. భారత జట్టు ఓడినా, గెలిచినా తామంతా మీతోనే ఉంటామంటూ పేర్కొంటున్నారు.
టోర్నీలో వరుస విజయాలతో అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించి ఫైనల్‌కు చేరిన రోహిత్ సేన ఆటతీరును తక్కవ చేయడానికి వీల్లేదు.
భారత్ ఓటమితో సామాజిక మధ్యమాల్లో అనుకూలంగా పోస్టులు పెడుతూ పలువురు ఆదర్శంగా నిలుస్తున్నారు.
భారత్ జట్టు కొన్ని విజయాలను సాధించి, కొన్ని ఓడిపోతుందని, అయితే తాము టీమిండియాకు మద్దతు ఇవ్వడం ఎప్పటికీ మరవమని జోమాటో పోస్టు పెట్టింది.
Details
భారత జట్టుకు మద్దతు పలికిన సచిన్, షారుక్ ఖాన్
టీమిండియా ఓడిపోలేదని, కష్టసమయాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
భారత ఆటగాళ్లు ఒక కుటుంబంలా ఆడి అందరి హృదయాలను గెలుచుకున్నారని, ఇప్పటికే తాను వారిని ఆదర్శంగా తీసుకున్నానని చెప్పాడు.
ఈ టోర్నీలో భారత జట్టు ఆడిన తీరు అందరికీ గర్వకారణమని, దేశాన్ని గర్వపడేలా చేశారని బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ వెల్లడించారు.
గెలుపోటములో ఆటలో భాగమేనని, భారత జట్టు అత్యత్తుమ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు.
భారత జట్టు వరుసగా 10 మ్యాచుల్లో విజయం సాధించి, ఎంతోమంది మాజీ ఛాంపియన్లు విన్నర్లను మట్టికరిపించారని, భారత ఆటగాళ్లను చూసి గర్వపడుతున్నామని నటుడు అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.