NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Priyansh Arya: పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టిన ప్రియాన్ష్ ఆర్య ఎవరు?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Priyansh Arya: పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టిన ప్రియాన్ష్ ఆర్య ఎవరు?
    పంజాబ్ కింగ్స్ తరపునఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టినప్రియాన్ష్ ఆర్య ఎవరు?

    Priyansh Arya: పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టిన ప్రియాన్ష్ ఆర్య ఎవరు?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2025
    10:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రతి రోజూ ఓ కొత్త స్టార్ వెలుగులోకి వస్తున్నాడు.మొన్న విజ్ఞేష్ పుతుర్,నిన్న విప్రజ్ నిగమ్.. ఇప్పుడు ప్రియాన్ష్ ఆర్య తన అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.

    అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ప్రియాన్ష్ ఆర్య తన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు.

    దుమ్మురేపిన ప్రియాన్ష్ ఆర్య

    ఓపెనర్‌గా వచ్చిన ప్రియాన్ష్ ఆర్య ఆరంభంలోనే విజృంభించాడు.ధాటిగా ఆడుతూ పంజాబ్ కింగ్స్‌కు శుభారంభాన్ని అందించాడు.

    అయితే, హాఫ్ సెంచరీను తృటిలో కోల్పోయాడు.23 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లతో 47 పరుగులు చేసిన ప్రియాన్ష్,కగిసో రబడా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.

    వివరాలు 

    ప్రియాన్ష్ ఆర్య ఎవరు? 

    అతను కొట్టిన రెండు సిక్స్‌లు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి.

    భయపడకుండా సునాయాసంగా భారీ షాట్లు ఆడిన ప్రియాన్ష్ ఆర్యను చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతను ఎవరా? అని ఆరా తీస్తున్నారు.

    ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే మక్కువ ఉన్న అతను స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడేవాడు.

    అతని ఆసక్తిని గుర్తించిన తండ్రి, ప్రఖ్యాత కోచ్ సంజయ్ భరద్వాజ్ అకాడమీలో చేర్పించాడు.

    అక్కడే క్రికెట్ విద్యను నేర్చుకున్న ప్రియాన్ష్, గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో మరింత మెరుగయ్యాడు. అతని టాలెంట్‌కు ఫిదా అయిన గంభీర్, ప్రియాన్ష్‌కి క్రికెట్ కిట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.

    వివరాలు 

    దేశవాళీ క్రికెట్‌లో ప్రభావం 

    ఢిల్లీ తరఫున ఏజ్ క్రికెట్ ఆడిన ప్రియాన్ష్, 2021లో దేశవాళీ టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

    2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

    తమిళనాడు స్పిన్నర్లు, కర్ణాటక పేసర్లను చిత్తుచేసి మరింత పేరు తెచ్చుకున్నాడు.

    2024లో జరిగిన ఈ ట్రోఫీలో 176.63 స్ట్రైక్‌రేట్‌తో 325పరుగులు చేశాడు.43బంతుల్లో 102పరుగులు చేసి టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు.

    ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు!

    ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రియాన్ష్ ఆర్య తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

    ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆడుతూ 608 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

    వివరాలు 

    ఐపీఎల్ 2025లో భారీ డీల్ 

    రెండు సెంచరీలు సాధించి, ఓ మ్యాచ్‌లో ఆయుష్ బదోనితో కలిసి 286 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

    ప్రియాన్ష్ ఆర్య అద్భుత ప్రదర్శనను గుర్తించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతనిని దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి.

    చివరకు, పంజాబ్ కింగ్స్ రూ. 3.8 కోట్ల భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ మెరిసినందున, మొదటి మ్యాచ్‌కే అవకాశం దక్కింది.

    ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ప్రియాన్ష్, తొలి మ్యాచ్‌లోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు.

    భారత జట్టులోకి ఎంట్రీ దూరం కాదు!

    ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే, ప్రియాన్ష్ ఆర్య త్వరలోనే భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది.

    ఈ యువ క్రికెటర్‌పై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దుమ్మురేపిన ప్రియాన్ష్ ఆర్య

    WELL PLAYED, PRIYANSH ARYA. 🔥

    - 47 (23) on IPL debut, a stupendous announcement made by Priyansh. The 24 year old has arrived at the IPL. 💯 pic.twitter.com/XTXBnEHPlw

    — Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    ఐపీఎల్

    Vizag IPL Matches: విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు.. మ్యాచ్‌ల తేదీలు, టికెట్ల వివరాలు ఇవే! విశాఖపట్టణం
    Punjab Kings: ఐపీఎల్ 2025 కోసం కొత్త స్పాన్సర్.. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపిన పంజాబ్ కింగ్స్ క్రికెట్
    IPL 2025: దిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు హ్యారీ బ్రూక్ గుడ్‌బై చెప్పినట్టేనా? క్రికెట్
     IPL 2025 TELUGU CRICKETERS: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోయిన తెలుగు క్రికెటర్ల రికార్డ్స్ ఇవే.. క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025