Page Loader
Team India: రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా ఎవరు? రేసులో సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, ధ్రువ్ జురెల్‌!
రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా ఎవరు? రేసులో సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, ధ్రువ్ జురెల్‌!

Team India: రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా ఎవరు? రేసులో సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, ధ్రువ్ జురెల్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2024
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022లో కారు ప్రమాదంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు జాతీయ జట్టులో ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నా, అతడికి బ్యాకప్‌ ఏవరంటా అనే ప్రశ్న కొనసాగుతుంది. ఈ రేసులో సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, ధ్రువ్ జురెల్‌ వంటి ఆటగాళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. భారత జట్టులో సీనియర్ల యుగం ముగిసే దశలో ఉంది, దీంతో బీసీసీఐ యువ ఆటగాళ్లను నిశితంగా పరిశీలిస్తూ, సీనియర్లకు ప్రత్యామ్నాయంగా మార్చడంపై దృష్టి సారిస్తోంది.

Details

విఫలమవుతున్న సంజు శాంసన్

సంజు శాంసన్ భారత జట్టులో అవకాశాలిస్తున్న వాటిని నిరూపించుకోవడంలో విఫలమవుతున్నారు. జులైలో జరిగిన శ్రీలంక పర్యటనలో రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. దులీప్ ట్రోఫీలోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా న్నాడు. ఈ ఏడాది బుచ్చిబాబు టోర్నీ ద్వారా డొమెస్టిక్ క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. తరువాత దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసి బ్యాకప్ రేసులో నిలిచాడు. ధ్రువ్ జురెల్ ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో బ్యాకప్ కీపర్‌గా ఉన్నాడు.

Details

బ్యాటర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్

ఇషాన్, సంజూ కాకుండా జితేశ్ శర్మ, కేఎస్ భరత్ లాంటి ఆటగాళ్లపై అశలు ఉన్నా వారు ఏ మేరకు రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ ప్రస్తుతం కీపర్‌గా కాకుండా బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో, రిషభ్ పంత్‌కు మంచి బ్యాకప్ గా ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.