
ICC World Cup 2023: సెమీ ఫైనల్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు? పాకిస్థాన్‌కు ఛాన్స్ ఉందా..?
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది.
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణిస్తూ భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆడిన ఎనిమిది మ్యాచుల్లోనూ టీమిండియా విజయఢంకా మోగించింది.
ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు చేరాయి. నాలుగో స్థానం కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్ పోటీపడుతున్నాయి.
ఈ తరుణంలో సెమీఫైనల్ తో భారత్ తలపడే జట్టు ఎవరన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్థాన్, సెమీస్‌లో ఇండియాతో పోటీపడాలంటే ఇంగ్లండ్‌తో జరిగే చివరి మ్యాచులో తప్పక గెలవాల్సి ఉంటుంది.
అయితే ఇతర జట్ల కన్నా నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్నందున ఆ మ్యాచులో పాక్ భారీ తేడాతో గెలవాలి.
Details
న్యూజిలాండ్ పై శ్రీలంక తప్పక గెలవాలి
ఇవాళ శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.
ఒకవేళ అన్ని కలిసొచ్చి పాక్ సెమీ ఫైనల్‌కి వస్తే ఈడెన్ గార్డెన్స్ గురువారం భారత్‌తో పాక్ తలపడుతుంది.
ఇది జరగాలంటే, పాకిస్థాన్ శనివారం జరిగే ఇంగ్లాండ్ మ్యాచులో తప్పక గెలవాల్సి ఉంటుంది.
మరోవైపు న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్ జట్ల ఫలితాలపై పాక్ ఆధారపడాల్సి ఉంటుంది.