Page Loader
Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్
గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్

Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'బాహుబలి' సిరీస్, 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి చిత్రాలతో తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి చేర్చిన ఆయన, సినిమాలతో పాటు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని ఎన్నోసార్లు వెల్లడించారు. తాజాగా ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 అనంతరం, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీలపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించిన అనంతరం, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌పై రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు.

Details

శ్రేయస్ షాట్ అద్భుతం

బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్ల యార్కర్లను థర్డ్ మ్యాన్ వైపు సున్నితంగా గైడ్ చేసి బౌండరీలుగా మార్చిన శ్రేయస్ అయ్యర్ స్టైల్ ను తాను నిజంగా ఆస్వాదించానని చెప్పారు. అతని ఆట తీరుతో పాటు, జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడంలో అతను పోషించిన పాత్రను ఆయన కొనియాడారు. శ్రేయస్ టైటిల్ గెలిచే అర్హత కలిగిన ఆటగాడని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఇక విరాట్ కోహ్లీ విషయంలో కూడా దర్శకుడు తన అభిమానం వెలిబుచ్చారు. కోహ్లీ ఐపీఎల్‌లో వేల పరుగులు చేసినా ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదన్న విషయంలో ఆయనకు గట్టి మద్దతు ఇచ్చారు.

Details

కోహ్లీ టైటిల్ గెలవడానికి అర్హుడే

'కోహ్లీ టైటిల్ గెలవడానికి అర్హుడే' అని రాజమౌళి ట్వీట్ చేశారు. తన ట్వీట్ చివర్లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ ఫైనల్‌లో ఎవరు గెలిచినా సరే, మరోవైపు మాత్రం హార్ట్ బ్రేక్ తప్పదని పేర్కొన్నారు. ఐపీఎల్ 2025 ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ట్రోఫీ కోసం పోరు జరుగనుండగా, ఈ రెండు జట్లు ఇప్పటివరకు టైటిల్ గెలవకపోవడంతో ఫైనల్ మరింత ఉత్కంఠను సంతరించుకుంది.