Rohit-Virat: సచిన్ లాగే కోహ్లీ, రోహిత్ ఎందుకు రంజీలలో ఆడకూడదు.. ప్రశ్నించిన మాజీ సెలెక్టర్!
భారత టెస్టు క్రికెట్‌లో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఓటమి అనంతరం ఎలాంటి పాఠాలు నేర్చుకోలేకపోయిన భారత్, రెండో టెస్టులోనూ ఓటమి పాలైంది. పుణె టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో విఫలమవ్వడంతో సీనియర్ ఆటగాళ్లపై విమర్శలొచ్చాయి. రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో ఆడాలనే డిమాండ్లు అభిమానుల నుంచి వస్తున్నాయి. మాజీ సెలక్టర్ సునీల్ జోషి ఈ విషయాన్ని ప్రస్తావించారు. రంజీ ట్రోఫీ లాంటి టోర్నీల్లో ఆడి స్పిన్‌ను ఎదుర్కొనే విధానాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ క్రికెట్ ఆడటం ఎందుకు అవసరం?" అని సునీల్ జోషి ప్రశ్నించాడు.
డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి
సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్ శర్మ కు రంజీ క్రికెట్ ఆడటం అవసరమని సచిన్ టెండూల్కర్ ఉదాహరణతో అభిమానులు గుర్తు చేస్తున్నారు. సచిన్ 40 ఏళ్ల వయసులో కూడా దేశవాళీ క్రికెట్ ఆడారని గుర్తు చేశారు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ చివరిసారిగా రంజీ క్రికెట్‌లో 2012, 2016లో మాత్రమే ఆడారు. వీరు ఎప్పటికైనా డొమెస్టిక్ క్రికెట్‌లో పాల్గొనాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2021 నుంచి టీమ్‌ఇండియా టాప్ బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో సగటు 34.84 రన్స్ మాత్రమే చేస్తున్నారు. ఇది పాకిస్థాన్ (44.46), శ్రీలంక (42.19), ఆస్ట్రేలియా (38.32), అఫ్గానిస్థాన్ (37.20), బంగ్లాదేశ్ (36.31) కంటే తక్కువ. ప్రత్యేకించి కోహ్లీకి స్పిన్‌లో 28.59 యావరేజ్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.