WI vs IND:వెస్టిండీస్‌తో వన్డే మ్యాచులు.. సిరీస్‌పై కన్నేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తో కైవసం చేసుకున్న టీమిండియా, రేపటి నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఆసియా కప్ టోర్నీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం.
మొదటి వన్డే జులై 27న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌ను కోల్పోయిన విండీస్, భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
మరోవైపు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
కెన్సింగ్టన్ ఓవల్‌లోని పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరించనుంది. మ్యాచ్ దూరదర్శన్‌లో రాత్రి 7: 30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Details
స్వదేశంలో విండీస్ కు మెరుగైన రికార్డు
విండీస్, ఇండియా ఇప్పటివరకూ 139 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 70 మ్యాచుల్లో విజయం సాధించగా, విండీస్ 63 మ్యాచుల్లో నెగ్గింది.
నాలుగు మ్యాచులు రద్దు కాగా, రెండు డ్రాగా ముగిశాయి. స్వదేశంలో భారత్‌పై వెస్టిండీస్‌కు మెరుగైన రికార్డు ఉంది.
విండీస్ స్వదేశంలో 42 వన్డేల్లో తలపడగా 20 మ్యాచుల్లో నెగ్గింది. భారత్ 19 మ్యాచుల్లో ఓటమిపాలైంది. గతేడాది స్వదేశంలో భారత్ 3-0తో విండీస్ ను ఓడించిన విషయం తెలిసిందే.
వెస్టిండీస్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో దారుణమైన ప్రదర్శన చేసింది.
స్కాట్లాండ్, శ్రీలంకతో విండీస్ ఓడిపోవడంతో వన్డే ప్రపంచకప్ నుంచి ఆ జట్టు నిష్క్రమించింది.
Details
భారత్, విండీస్ జట్టులోని ఆటగాళ్లు వీరే
ఈ మ్యాచులో విండీస్ ప్లేయర్ హోప్ 5వేల పరుగుల మార్కును చేరుకోవడానికి 171 పరుగుల దూరంలో ఉన్నాడు.
13వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 102 పరుగులు అవసరం.
భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.
విండీస్ జట్టు : బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్ (కెప్టెన్ ), షిమ్రాన్ హెట్మెయర్, కైల్ మేయర్స్, రోవ్‌మన్ పావెల్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్ మరియు ఒషానే థామస్.
Details
అరుదైన రికార్డుకు చేరువలో రవీంద్ర జడేజా
వన్డేల్లో విండీస్ పై ఇప్పటివరకూ కపిల్ దేవ్ 43 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కపిల్ దేవ్ ను అధిగమించేందుకు రవీంద్ర జడేజా కు మూడు వికెట్లు అవసరం. అదే విధంగా 200 వన్డే వికెట్ల క్లబ్ లో చేరడానికి జడేజా తొమ్మిది వికెట్ల దూరంలో ఉన్నాడు.
వన్డేల్లో 50 వికెట్ల క్లబ్ లో చేరడానికి టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఏడు వికెట్ల దూరంలో ఉన్నాడు.