WI vs IND: విజయానికి 8 వికెట్ల దూరంలో టీమిండియా
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండు టెస్టుల్లో వరుణుడు కొన్నిసార్లు అటకం కలిగించినా టీమిండియా విజయానికి అత్యంత చేరువైంది. తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు ఆధిక్యం సాధించిన భారత్, రెండో ఇన్నింగ్స్ లో 181 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు భారత జట్టు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. వెస్టిండీస్ విజయానికి 289 పరుగులు కావాల్సి ఉండగా, టీమిండియా గెలుపునకు 8 వికెట్ల దూరంలో ఉంది. ఇక చివరి రోజు భారత బౌలర్లు రాణిస్తే టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంటుంది.
రవిచంద్రన్ అశ్విన్ రికార్డు
విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ చేయడంతో సిరాజ్ (5/60) కీలక పాత్ర పోషించారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడారు. రోహిత్ శర్మ (57), యశస్వీ జైస్వాల్(38), ఇషాన్ కిషన్ 52 పరుగులతో చెలరేగారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లతో రాణించాడు. టెస్టుల్లో క్రెగ్ బ్రాత్‌వైట్(8)ని ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. క్రెగ్ బ్రాత్ వైట్, టగెనరైన్ చంద్రపాల్ 18 ఓవర్ల వరకూ వికెట్ పడకుండా అడ్డుకోలగలిగారు. కెప్టెన్ బ్రాత్ వైట్(28), కిర్క్ మెకెంజీ(0) పూర్తిగా నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో టగెనరైన్ చంద్రపా్(24), బ్లాక్ వుడ్(20) క్రీజులో ఉన్నారు.
టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డు
టెస్టుల్లో వెస్టిండీస్ పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 89 వికెట్లతో కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 75 వికెట్లతో రెండో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు పడగొట్టిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఈ మైలురాయిని అధిగమించాడు. 12.2 ఓవర్లలోనే 100 పరుగులు చేసి టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటివరకూ ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. గతంలో బంగ్లాదేశ్ పై 13.2 ఓవర్లలోనే శ్రీలంక 100 పరుగుల మార్కును అందుకుంది.