LOADING...
Shaheen Afridi: అరుదైన ఘ‌న‌త సాధించిన పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ షాహీన్‌ ఆఫ్రిది 
అరుదైన ఘ‌న‌త సాధించిన పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ షాహీన్‌ ఆఫ్రిది

Shaheen Afridi: అరుదైన ఘ‌న‌త సాధించిన పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ షాహీన్‌ ఆఫ్రిది 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ ఆఫ్రిది అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో అతను నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో, అరంగేట్రం నుంచి తొలి 65 వన్డే మ్యాచ్‌లలోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అఫ్గానిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ పేరిట ఉండేది. రషీద్‌ తొలి 65 వన్డేలలో 128 వికెట్లు తీయగా, షాహీన్‌ ఆఫ్రిది 131 వికెట్లను సాధించి ఆ రికార్డును అధిగమించాడు.

వివరాలు 

షాహీన్‌ ఆఫ్రిది నాలుగు వికెట్లు 

మొదటి వన్డే మ్యాచ్‌ విషయానికి వస్తే..వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 49 ఓవర్లలో 280 పరుగులకే ఆలౌటైంది. విండీస్‌ బ్యాటర్లలో ఎవిన్‌ లూయిస్‌ (60; 62 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ షై హోప్‌ (55; 77 బంతుల్లో 4 ఫోర్లు), రోస్టన్‌ చేజ్‌ (53; 54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. పాకిస్థాన్‌ బౌలర్లలో షాహీన్‌ ఆఫ్రిది నాలుగు వికెట్లు తీసి ప్రధాన భూమిక వహించాడు. నసీమ్‌ షా మూడు వికెట్లు సాధించగా, సైమ్‌ అయూబ్‌, సుఫియాన్‌ ముఖీమ్‌, సల్మాన్‌ అఘా చెరో వికెట్‌ తీశారు. అనంత‌రం 281 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాక్ 48.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

వివరాలు 

విండీస్‌ బౌలర్లలో షమర్‌ జోసెఫ్‌ రెండు వికెట్లు

పాక్‌ బ్యాటర్లలో హసన్‌ నవాజ్‌ (63 నాటౌట్‌; 54 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు),కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (53; 69 బంతుల్లో 4 ఫోర్లు)అర్ధసెంచరీలు నమోదు చేశారు. బాబర్‌ ఆజమ్‌ (47; 64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌),హుస్సేన్‌ (41 నాటౌట్‌; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. విండీస్‌ బౌలర్లలో షమర్‌ జోసెఫ్‌ రెండు వికెట్లు తీశాడు. జేడెన్‌ సీల్స్‌, గుడాకేష్‌ మోటీ,రోస్టన్‌ చేజ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ విజయంతో పాకిస్థాన్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో వన్డే మ్యాచ్‌ కూడా ఇదే వేదికపై వచ్చే ఆదివారం (ఆగస్టు 10న) జరగనుంది.