Page Loader
అక్షర పటేల్ ఔట్.. కుల్దీప్ ఇన్..?
టెస్టు జట్టులో స్థానం సంపాదించిన కుల్దీప్

అక్షర పటేల్ ఔట్.. కుల్దీప్ ఇన్..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2023
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. మరో మూడ్రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు తెరవేవనుంది. గురువారం నుంచి నాగపూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో టీమిండియా పట్టు సాధించాల్సి ఉంది. మోకాలి గాయం నుండి కోలుకున్న రవీంద్ర జడేజా టెస్టులోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థుల వికెట్లు తీయగల సత్తా ఉంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే మూడో స్పిన్నర్‌గా ఎవరిని నియామకం చేయాలో తెలియక టీమిండియా సతమతమవుతోంది. ఈ స్థానానికి కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్ పోటీ పడుతున్నారు.

కుల్దీప్ యాదవ్

కుల్దీప్‌కు అవకాశం కల్పించాలి

ఇటీవల జరిగిన మీర్పూర్ టెస్టులో వీరద్దరిలో ఆడించాలో ఆర్థం కాలేదు. కుల్దీప్ మొదటి టెస్టులో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ ఉనద్కత్‌కు ఛాన్స్ ఇచ్చారు. లెఫ్ట్ఆర్మ్ బ్యాటింగ్ విభాగంలో అక్షర్ 23 సగటుతో 12 వికెట్లు తీయగా.. కుల్దీప్ 19.38 సగటుతో 13 వికెట్లు తీశాడు. రైట్‌హ్యాండ్ విభాగంగా అక్షర్ 11.31 సగటుతో 35 వికెట్లు తీయగా.. కుల్దీప్ 22.9 సగటుతో 21 వికెట్లు తీశారు. తొలిటెస్టులో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ ఓపెనర్ వసీంజాఫర్ పేర్కొన్నారు. అయితే అక్షర్ పటేల్‌కు మొండి చెయ్యి చూపించాడు.. అతని స్థానంలో కుల్దీప్‌యాదవ్‌ను ఎంపిక చేయాలని జాఫర్ అన్నారు.