Jai Shah: గౌరవంగా ఉంది.. టెస్టు క్రికెట్‌పై జై షా కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నూతన ఛైర్మన్‌గా జై షా ఎంపికయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా, డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికై అత్యంత పిన్న వయస్కుడిగా జై షా చరిత్ర సృష్టించాడు. గ్రెగ్ బార్క్లే స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికైన అయిదో భారతీయుడిగా జై షా నిలిచాడు. అతనికంటే ముందుగా జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఉన్నారు. ఈ సందర్భంగా జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచడంపై దృష్టి సారిస్తానని తెలిపారు. టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తమన్నారు.
మహిళల, దివ్యాంగుల క్రికెట్ ను ప్రోత్సహిస్తా
ఐసీసీ సభ్యులు బోర్డులు తనపై ఉంచిన విశ్వాసానికి తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం గౌరవంగా ఉందన్నారు. మహిళలు, దివ్యాంగుల క్రికెట్‌ను ప్రోత్సహించడంలో ప్రత్యేక చర్యలు చేపడతానని జై షా వెల్లడించారు. అయితే, జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జై షా, బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడే టీమిండియా పాక్‌కు వెళ్లబోదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ ఛైర్మన్‌గా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.