Womens Ashes Series : యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం
ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఏకైక మహిళల టెస్టు రసవత్తరంగా సాగింది. ఈ టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆల్ రౌండర్ అష్ గార్డ్ నర్ 8 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టుపై 89 పరుగుల తేడాతో ఆసీస్ విజయం నమోదు చేసింది. గార్డ్ నర్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 178 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు లభించింది. ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరిగిన తొలిఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 473 పరుగులు చేసింది. ఎలిసా పెర్రీ (99) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, సథర్ లాండ్ (137) రికార్డు శతకం చేయడంతో ఆసీస్ భారీ స్కోరును ఉంచింది.
రెండు ఇన్నింగ్స్ లో 12 వికెట్లు తీసిన గార్డ్ నర్
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆసీస్ కు ధీటుగానే బదులిచ్చింది. టమ్మీ బ్యామెంట్ (208) డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ కు కేవలం 10 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 257 పరుగులకు ఆలౌటైంది. 268 పరుగులకు లక్ష్య చేధనకు దిగిన ఆసీస్ చేధనలో తడబడింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డానియల్ వయట్ (54) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గార్డ్ నర్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 12 వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది.