Page Loader
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ హీరోలు ! 
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ హీరోలు !

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ హీరోలు ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2024
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2వ ఎడిషన్ శుక్రవారం(ఫిబ్రవరి 23)నుండి ప్రారంభం కానుంది. టోర్నీలో తొలి పోరు ముంబై ఇండియన్స్(MI),ఢిల్లీ క్యాపిటల్స్(DC)మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై,ఢిల్లీ మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కి ముందు బీసీసీఐ ప్రారంభ వేడుకను నిర్వహించనుంది.ఈ వేడుకకు బాలీవుడ్ హీరోలు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభోత్సవ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు యువ హీరోలు సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్‌లు విచ్చేయనున్నారు.వీరితో పాటు మరికొందరు స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పేర్కొంది.

Details 

 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు డ‌బ్ల్యూపీఎల్‌ 2024 

WPL 2023 ప్రారంభ వేడుకలో,బాలీవుడ్ నటీమణులు కృతి సనన్,కియారా అద్వానీ మెరిసిన విషయం తెలిసిందే. డ‌బ్ల్యూపీఎల్‌ 2024 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది.WPL రెండవ సీజన్ బెంగళూరు,ఢిల్లీ నగరాల్లో జరుగుతుంది. గతేడాది లీగ్ మ్యాచ్‌లు ముంబై, నవీ ముంబైలలో జరిగాయి. రాబోయే సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి 11 మ్యాచ్‌లు బెంగళూరులో జరగనుండగా, మిగిలిన మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతాయి. ఐదు జట్ల టోర్నమెంట్‌లో రెండో సీజన్‌లో డబుల్‌హెడర్ లేదు. మార్చి 13న లీగ్ దశ ముగియనుంది.

Details 

గతేడాది ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్ 

మార్చి 13న లీగ్ దశ ముగియనుంది. ఎలిమినేటర్ మార్చి 15న, ఫైనల్ మ్యాచ్ మార్చి 17న ఢిల్లీలో జరగనుంది. లీగ్ రౌండ్‌లో 20 మ్యాచ్‌లు జరగనుండగా.. అగ్రస్థానంలో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తాయి. గతేడాది హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై చాంపియిన్‌గా నిలిచింది. ముంబై ఇండియ‌న్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్, యూపీ వారియ‌ర్స్, గుజ‌రాత్ జెయింట్స్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు టైటిలో కోసం పోటీ పడనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చేసిన ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చేసిన ట్వీట్