Page Loader
WTC 2023-25: భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ  
భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ

WTC 2023-25: భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌కు స్వదేశంలో టెస్టు ఓటమి ఎదురైంది. బెంగళూరులో కివీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ పాయింట్ల పట్టికపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే, భారత్‌ తన స్థానాన్ని కోల్పోలేదు, కానీ పర్సంటేజీలో మాత్రం కొద్దిగా తగ్గుదల కనిపించింది. తాజా పట్టిక ప్రకారం, టీమిండియా టాప్‌ స్థానంలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు భారత్‌ 12 టెస్టులు ఆడగా, 8 విజయాలు సాధించిందీ, 3 టెస్టుల్లో ఓడి, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఫలితంగా, భారత్‌కు 98 పాయింట్లు ఉన్నాయి. పర్సంటేజీలో 74.24% నుంచి 68.06%కి పడిపోయింది.

వివరాలు 

మొదటి రెండు స్థానాల్లో ఉండాలంటే.. 

ఆస్ట్రేలియా 62.50%తో రెండో స్థానంలో, శ్రీలంక 55.56%తో మూడో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్‌ 44.40%తో నాలుగో స్థానానికి చేరుకుంది. భారత్‌ మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుకోవాలంటే, ఈ సీజన్‌లో టాప్‌-2లో నిలవాలి. ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, ఈ ఓటమి తర్వాత రాబోయే మ్యాచ్‌లు కీలకంగా మారాయి. భారత్‌ ఇంకా 7 టెస్టులు ఆడనుంది, ఇందులో కివీస్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఉన్నాయి. కనీసం 4 మ్యాచ్‌ల్లో గెలిస్తే టాప్‌-2లో నిలవగలదు. పాయింట్ల కోత లేకుండా చూసుకోవాలి, ముఖ్యంగా స్లో ఓవర్ రేట్ వల్ల పాయింట్లు తగ్గే అవకాశం ఉంది.