ఆసియాకప్ జట్టులో చాహల్ కు చోటు ఎందుకు దక్కలేదో తెలుసా
ఆసియా కప్ 2023కు ప్రకటించిన భారత జట్టులో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు చోటు దక్కలేదు. ఇప్పటికే జట్టులో కీలక లెగ్ స్పిన్నర్ గా చాహల్ కు పేరుంది. ప్రత్యేకించి టెస్ట్ మ్యాచ్‌ల్లో నాణ్యమైన స్పిన్నర్ గా ఎదుగుతున్నాడు. చాహల్ కు జట్టులో చోటు కల్పించకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తిగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ జట్టులో ఎడమ చేతివాటం కుల్దీప్ యాదవ్ మాత్రమే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా గుర్తింపు దక్కించుకున్నారు. మరోవైపు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్లు జట్టులో ఉండనే ఉండటం గమనార్హం. మరోవైపు ఆసియా కప్ టోర్నీని శ్రీలంకలోనే ఎక్కువగా ఆడాల్సి ఉన్నందున అక్కడ పిచ్ స్పిన్నర్లకే అనుకూలిస్తుందనేది తెలిసిందే.
పేసర్ల కారణంగానే చాహల్ కు దక్కని చోటు
భారత్ కనీసం 4 స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని అంతా భావించారు.బదులుగా పేస్ బౌలింగ్ కే ప్రాధాన్యం ఇవ్వడంతో చాహల్ కు చోటు దక్కలేదు. 2022 నుంచి 30 టీ20ల్లో 8.01 ఎకానమీ రేటుతో 32 వికెట్లను పడగొట్టాడు. 2022 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 17 ఆడగా,27 వికెట్లను కూల్చాడు. దీంతో ఆ సిజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. 72 వన్డేలు ఆడిన చాహల్ 121 వికెట్లను పడగొట్టాడు.5సార్లు నాలుగు వికెట్లు, 2సార్లు ఐదు వికెట్లలను కూల్చిన ఘనత చాహల్ కు దక్కింది. మరోవైపు ప్రపంచకప్ నాటికి చాహల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశమున్నట్లు సెలక్టర్ అగార్కర్ చెప్పారు. ప్రస్తుతం పేసర్ల అవసరం ఉన్నందునే చాహల్ ఎంపిక జరగలేదని కెప్టెన్ రోహిత్ అన్నారు.