Page Loader
Zaheer Khan:లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా జహీర్ ఖాన్
లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా జహీర్ ఖాన్

Zaheer Khan:లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా జహీర్ ఖాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2024
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడిని తమ జట్టు మెంటర్‌గా నియమించినట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి జహీర్ ఖాన్ ఈ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. జహీర్ ఖాన్ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి రాణించారు. 2015లో రిటైన్ తర్వాత 2018 నుంచి 2022 వరకు ముంబయి ఇండియన్స్ గ్లోబెల్ హెడ్‌గా, డైరక్టర్‌గా పనిచేశారు.