
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ ఆత్మవిశ్వాసమే నాగ్‌పూర్ వన్డేలో భారత్ విజయానికి నాంది: జహీర్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ (IND vs ENG)లో భారత్ అదిరిపోయే విజయం సాధించింది.
శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అర్థ శతకాలు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) మోకాలి వాపు కారణంగా తుది జట్టులో ఆడనందున, శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది.
ఈ విషయాన్ని అతడే మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్, తన ఆత్మవిశ్వాసాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు.
భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ,శ్రేయస్ తన ఆటను ఇలాగే కొనసాగిస్తే మిగతా మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన అందించగలడని అభిప్రాయపడ్డాడు.
వివరాలు
శ్రేయస్ దూకుడు అద్భుతం - జహీర్ ఖాన్
రెండో వన్డే నాటికి విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఇప్పటికే వైస్ కెప్టెన్ గిల్ స్పష్టం చేశారు.
"ప్రతి ఒక్కరూ శ్రేయస్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ అతడి ఎదురుదాడి చేసిన తీరు మరింత అద్భుతం. భారత్ రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో, సాధారణంగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్ నెమ్మదిగా ఆడతాడు. కానీ, శ్రేయస్ తన కాన్ఫిడెన్స్‌తో ప్రత్యర్థిపై దూకుడుగా ఆడాడు. పిచ్ నుంచి బౌలర్లకు కొంత సహకారం ఉన్నప్పటికీ, లక్ష్య ఛేదనలో వెనకడుగు వేయకూడదని అతడు నిర్ణయించుకున్నాడు.
శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మధ్య ఏర్పడిన భాగస్వామ్యం జట్టు విజయంలో కీలకమైంది.
ఇలాంటి మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను పక్కన పెట్టడం సరైంది కాదని" జహీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
వివరాలు
శ్రేయస్‌ను ఎలా పక్కన పెడతారు? - ఆకాశ్ చోప్రా
భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా శ్రేయస్ ప్రదర్శనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"శ్రేయస్ అయ్యర్ తన స్థానంపై చేసిన వ్యాఖ్యలను తలకెక్కించుకుంటున్నా. కోహ్లీ ఫిట్ కాకపోవడంతో అతడికి అవకాశం లభించింది. కానీ, వన్డే ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 500కి పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ శ్రేయస్. అలాంటి ఆటగాడిని ఎలా బెంచ్‌కే పరిమితం చేస్తారు? అతడు లేకుంటే సెకండ్ డౌన్‌లో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారు? విరాట్ కోహ్లీ ఆడతాడా? లేక గిల్‌ను నాలుగో స్థానంలోకి పంపిస్తారా?" అంటూ చోప్రా తన సందేహాన్ని వ్యక్తం చేశారు.