తదుపరి వార్తా కథనం

Hassan Nasrallahs: హిజ్బుల్లా చీఫ్ మృతికి నివాళిగా.. ఇరాక్‌లో 100 మంది నవజాత శిశువులకు నస్రల్లా పేరు
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 03, 2024
10:42 am
ఈ వార్తాకథనం ఏంటి
గత వారం ఇజ్రాయెల్ బీరుట్‌పై చేసిన ఘోర దాడుల్లో హెజ్‌బొల్లా నేత హసన్ నస్రల్లా మరణించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా, ఆయనకు గౌరవార్థం ఇరాక్‌లో వంద మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టారని ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
లెబనాన్‌లోని బీరుట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా, నస్రల్లా మరణించారు.
ఈ ఘటనపై నిరసనగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు ప్రదర్శించారు.
వివరాలు
'నస్రల్లా ఒక అమరుడైన యోధుడు'
ఈ నేపథ్యంలో, ఆయన స్మారకార్థం 100 మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టామని ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
అలాగే, 'నస్రల్లా ఒక అమరుడైన యోధుడు' అని ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీ ప్రశంసించారు.
హసన్ నస్రల్లా అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నట్లు పలు వార్తా మాధ్యమాలు పేర్కొన్నాయి.