Page Loader
Sheikh Hasina: హసీనా అప్పగింత పిటిషన్ పై 'మనస్సాక్షితో' వ్యవహరించాలని భారత్‌కు బంగ్లా అభ్యర్థన
హసీనా అప్పగింత పిటిషన్ పై 'మనస్సాక్షితో' వ్యవహరించాలని భారత్‌కు బంగ్లా అభ్యర్థన

Sheikh Hasina: హసీనా అప్పగింత పిటిషన్ పై 'మనస్సాక్షితో' వ్యవహరించాలని భారత్‌కు బంగ్లా అభ్యర్థన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందిన తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై భారత్ నైతికతతో కూడిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ,తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ తరఫున ఆయన ప్రెస్ సెక్రటరీ సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రకటనను విడుదల చేశారు.

వివరాలు 

చట్టపరమైన పరిపాలన, ప్రజాస్వామ్య విలువలను భారత్ గౌరవించాలి 

ఈ ప్రకటనలో, ''షేక్ హసీనాను బంగ్లాదేశ్ అనేకసార్లు అప్పగించాలన్న విజ్ఞప్తి చేసింది.అయితే భారత్ ఈ దిశగా ఇప్పటివరకు స్పందించలేదు.ఈ అంశాన్ని అంతకు మించి కాలయాపన చేయడం సమంజసం కాదు.మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి రక్షణ కల్పించడం తగదు.ఉద్దేశపూర్వకంగా పౌరుల హత్యలకు పాల్పడ్డవారిని ఏ ప్రాంతీయ సంబంధం అయినా,ఏ రాజకీయ వారసత్వం అయినా కాపాడలేవు.చట్టపరమైన పరిపాలన, ప్రజాస్వామ్య విలువలను భారత్ గౌరవించాలని మేము కోరుతున్నాం'' అని పేర్కొన్నారు.

వివరాలు 

అల్లర్లలో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు

ఎంత బలమైన నాయకులైనా చట్టానికి లోబడాలని,బాధితులకు న్యాయం తప్పకుండా జరగాలని యూనస్ స్పష్టం చేశారు. గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వదిలి,విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో ప్రధానిగా పదవి నుండి తప్పుకున్న షేక్ హసీనా,అప్పటి నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె పార్టీ అయిన అవామీ లీగ్‌కు మద్దతు తెలిపే హిందూ మైనారిటీలపై, వారి ప్రార్థనా మందిరాలపై తీవ్ర దాడులు జరిగాయి. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, ఆ అల్లర్లలో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

హసీనాపై హత్య కేసులతో పాటు అనేక ఫిర్యాదులపై కేసులు నమోదు

ఈ ఘటనల అనంతరం మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం, హసీనాపై హత్య కేసులతో పాటు అనేక ఫిర్యాదులపై కేసులు నమోదు చేసింది. అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ ఆమెను కోర్టు ధిక్కరణ కేసులో అరెస్ట్ చేసి, ఆరు నెలల కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను తిరిగి తమ దేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది.