walkie-talkies blown up: పేజర్ పేలుళ్ల తర్వాత.. ఈ మారు వాకీ-టాకీలు పేలాయి.. 9 మంది మృతి
లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లతో విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీ పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చారు.అలాగే సౌర పరికరాలనూ పేలుళ్లకు వినియోగించారు. ఈ పేలుళ్లలో 14మంది మరణించగా, 450మందికి పైగా గాయపడ్డారు.లెబనాన్ ఆరోగ్య శాఖ ఈ దాడులకు ఇజ్రాయెలే కారణమని భావిస్తున్నామని వెల్లడించింది. పేజర్ల పేలుళ్లలో ముగ్గురు హెజ్‌బొల్లా సభ్యులు,ఒక బాలుడు మృతిచెందారు. బీరుట్‌లో బుధవారం నిర్వహించిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు, అప్పుడు వాకీటాకీలను పేల్చారు. అదేవిధంగా,సిడోన్ తీర ప్రాంతంలో ఒక కారుతో పాటు ఒక దుకాణంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బీరుట్‌లోని పలు ఇళ్లలో సౌర పరికరాలు కూడా పేలాయి.హెజ్‌బొల్లా గ్రూప్‌కు చెందిన రేడియో పరికరాలూ పేలిపోయాయి.
లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు జపాన్‌లో..
లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు జపాన్‌లో తయారవ్వగా, వాటిపై ఐకామ్ అని ఉంది. ఐకామ్ కంపెనీ రేడియో కమ్యూనికేషన్, టెలిఫోన్ పరికరాలను తయారుచేస్తుంది. అయితే, లెబనాన్‌లో పేలిన వాకీటాకీల ఉత్పత్తిని చాలా కాలం కిందట ఆపేశామని ఐకామ్ తెలిపింది. ఈ రేడియో కమ్యూనికేషన్ పరికరాలను హెజ్‌బొల్లా 5 నెలల కిందట కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించింది.యుద్ధం మరొక కీలక దశలోకి ప్రవేశించిందని,మరింత ధైర్యం,అంకితభావం అవసరమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ బుధవారం ప్రకటించారు. సైన్యం సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.మరోవైపు,లెబనాన్ సరిహద్దుల్లోకి పెద్ద సంఖ్యలో సైన్యాన్ని ఇజ్రాయెల్ తరలిస్తోంది. పేజర్ల పేలుళ్లు శాంతి ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్య సమితి ఓటింగ్‌లో పాల్గొని భారత్
ఇదే సమయంలో, గాజాతో పాటు వెస్ట్‌బ్యాంకును ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది. 193 సభ్య దేశాల్లో 124 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, 14 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా 43 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.