హవాయి కార్పిచ్చు : మౌయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రకృతి విపత్తు సంభవించింది. ఈ మేరకు హవాయి ద్వీప సమూహం మంటల్లో కాలిబూడిదైంది. ఇప్పటికే రూ.50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.
కార్చిచ్చు బీభత్సం కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 111కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ మేరకు మౌయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి హర్మాన్ ఆండయా రాజీనామా చేశారు. అత్యవసర నిర్వహణలో గతంలో ఎటువంటి అనుభవం లేని హర్మన్ రాజీనామా సమర్పించారు.
ఇందుకు ఆరోగ్య సంబంధిత సమస్యలే కారణమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సదరు రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు మౌయి కౌంటీ అధికారులు వెల్లడించారు.
లహైనా అగ్నిప్రమాదంపై తన ఏజెన్సీ సరైన సమయంలో స్పందించలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
DETAILS
సైరన్లు వేస్తే ప్రజలు ఎత్తైన ప్రదేశాలు (కార్పిచ్చు) వైపు వెళ్లే ప్రమాదం ఉంది : ఆండయా
మరోవైపు ఈ శతాబ్దంలోనే ఘోరమైన కార్పిచ్చు సంభవించింది. మౌయి అటవీలో ఆగస్ట్ 8న కార్పిచ్చు చెలరేగినప్పుడు, నివాసితులు ఇళ్లు ఖాళీ చేయలేదు.
ద్వీపంలో సైరన్ల హెచ్చరిక మోగపోవడంతోనే తరలింపు ప్రక్రియ జరగలేదనే తీవ్ర విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలోనే మౌయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు హర్మన్ ఆండయా బుధవారం చెప్పారు. ప్రస్తుత కార్పిచ్చు విజృంభిస్తున్న దృష్ట్యా త్వరలోనే కొత్త అధిపతిని నియమిస్తామని మౌయి మేయర్ రిచర్డ్ బిస్సెన్ ప్రకటన చేశారు.
సైరన్‌లను ఎందుకు మోగించనందుకు చింతిస్తున్నారా అని విలేకరులు అడగగా,సైరన్‌లు మోగిస్తే ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లేవారని, అదే జరిగితే వారు కార్పిచ్చులోకి వెళ్లి ఉండేవారని ఆండయా బదులిచ్చారు.
సునామీలు లేదా తుఫానులపై హెచ్చరించేందుకే సైరన్‌లు ఉపయోగిస్తారని చెప్పారు.