LOADING...
Presidential Medal of Freedom: లియోనెల్ మెస్సి, జార్జ్‌ సోరోస్‌తో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత గౌరవం
లియోనెల్ మెస్సి, జార్జ్‌ సోరోస్‌తో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత గౌరవం

Presidential Medal of Freedom: లియోనెల్ మెస్సి, జార్జ్‌ సోరోస్‌తో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత గౌరవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' పురస్కారానికి ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో 19 మంది ప్రముఖులున్నారు. వారిలో యూఎస్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్, ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి, బిలియనీర్ జార్జ్ సోరోస్ తదితరులున్నారు. అమెరికా కాలమానం ప్రకారం, ఈ పురస్కార ప్రదానం వైట్‌హౌస్‌లో శనివారం మధ్యాహ్నం జరగనుంది. ఈ పురస్కారం అందుకున్న వారంతా తమ రంగాల్లో విశిష్టమైన సేవలందించారని, వారు అమెరికా ఉన్నతికి, ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేశారని జో బైడెన్ అభినందించారు. జార్జ్ సోరోస్, హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆయన, ప్రజాస్వామ్యం, పారదర్శకత, భావప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వ్యక్తి.

Details

మానవ హక్కుల పరిరక్షణకు అనేక సేవా కార్యక్రమాలు

ఆయన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా మానవ హక్కుల పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంస్థ ప్రస్తుతం 70 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. సోరోస్ తన మద్దతు ఇస్తున్న బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్ విధానాలను సపోర్ట్ చేస్తారు. ఆయన గతంలో ట్రంప్, జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు కూడా చేశారు. 2023లో అదానీ గ్రూప్‌పై వచ్చిన వివాదం కూడా సోరోస్‌ వ్యాఖ్యలతో సంబంధించింది. లియోనెల్ మెస్సి అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం కాగా, హిల్లరీ క్లింటన్ 2009-2013 మధ్య బరాక్ ఒబామా అధ్యక్షకాలంలో విదేశాంగ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు.