America-Universities-Tear gas-Students-protests: పాలస్తీనా అనుకూల ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా పోలీసులు..విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగం
గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel)-హమాస్ (Hamas)యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా యూనివర్సిటీ (University)ల్లో జరుగుతున్న ఆందోళన (Protests)లను యూఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న 2,000 మందికి పైగా ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం కూడా ఆందోళనలు చేసిన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ (Tear Gas) ను ప్రయోగించి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు (Cops) విద్యార్థులను చెదరగొట్టారు. దీంతో విద్యార్థులు తమపై పోలీసులు దౌర్జాన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఆందోళనలు ముగిశాయని ప్రకటించిన వర్సిటీ యాజమాన్యం
ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం చార్లోట్స్‌విల్లేలో ఉన్న ఓ యూనివర్సిటీ ''విశ్వవిద్యాలయంలోని ప్రాంగణంలో పాలస్తీనాకు మద్దతుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ముగిసింది. విద్యార్థులు యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘించి హింసాత్మకంగా వ్యవహరించారని, శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేయలేదు."అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొంది. అరెస్టైన ఆందోళన కారుల్లో యూనివర్సిటీ విద్యార్థులు ఎంతమందనే ఆరా తీస్తున్నట్లు యూనివర్సిటీ యాజమాన్య వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి యూనివర్సిటీ విద్యార్థులు వర్సిటీ ప్రాంగణంలో తమ పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు ఆందోళనలు వర్సిటీ యాజమాన్యం అణచివేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ ఆందోళనలు దేశవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాయాలకు పాకిపోయాయి. దీంతో ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు బలప్రయోగాలకు దిగాల్సి వచ్చింది.
వర్సిటీల్లో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి
శనివారం కూడా వర్సిటీ ప్రాంగణంలో ఆందోళన శిబిరాలను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించగా విద్యార్థులు వారిని తీవ్రంగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం అమెరికా యూనివర్సిటీల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.