అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి తుపాకీ కాల్పులకు బలయ్యాడు. ఓహియోలోని పెట్రోల్ బంకులు పార్ట్ టైమ్ చేస్తున్న ఏలూరుకు చెందిన సాయీష్ వీరపై గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 20న దుండగులు సాయీష్ వీరాపై కాల్పులు జరపగా, గాయాలతో పడి ఉన్న అతడిని కొలంబస్ అగ్నిమాపక వైద్యులు వచ్చి బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎంత ప్రయత్నించినా అతడి ప్రాణాన్ని కాపాడలేకపోయినట్లు వైద్యులు చెప్పారు.
10రోజుల క్రితమే H1B వీసాకి ఎంపిక
ఈ ఘటనపై దర్యాప్తును చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన సమాచారన్ని బంధువులకు తెలియజేసినట్లు పోలీసులు వెల్లడించారు. సాయీష్ వీర మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి పంపడానికి ఆన్‌లైన్ నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అతని స్నేహితుడు రోహిత్ యలమంచిలి చెప్పారు. వీర మాస్టర్స్ కోర్సు చేస్తున్నాడని, 10రోజుల క్రితం అతను H1B వీసాకి ఎంపికైనట్లు వివరించారు. వీర మరో రెండు వారాల్లో ఇంధన స్టేషన్‌లో క్లర్క్‌గా తన పనిని విడిచిపెట్టబోతున్నాడని చెప్పారు. వీర ఎన్నో ఆశలతో అమెరికాకు వచ్చారని, రెండేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని ఆదుకోవాలని అనున్నట్లు పేర్కొన్నారు.