LOADING...
Asim Munir: 'ఈసారి తూర్పునుంచి మొదలవుతుంది': భారత్‌కు ఆసిమ్ మునీర్ సహచరుడి హెచ్చరిక
'ఈసారి తూర్పునుంచి మొదలవుతుంది': భారత్‌కు ఆసిమ్ మునీర్ సహచరుడి హెచ్చరిక

Asim Munir: 'ఈసారి తూర్పునుంచి మొదలవుతుంది': భారత్‌కు ఆసిమ్ మునీర్ సహచరుడి హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్‌ పట్ల తీసుకున్న దూకుడు విధానంపై తాజాగా ఓ కీలక వ్యాఖ్య వెలువడింది. బహుశా భారత్‌పై భవిష్యత్ యుద్ధ ఉద్రిక్తతలు తలెత్తినపుడు, మునీర్ ఎక్కువ లోతుగా దాడి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు పాక్‌ సైనిక ప్రతినిధి వెల్లడించాడు. భారత్‌ను చర్చలకు తీసుకురావాలనే లక్ష్యం ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది ఎకనమిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ సైనిక ప్రతినిధి జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ, ఆసిమ్ మునీర్ ఆశయాలేంటో స్పష్టంగా తెలిపారు. "భారత్‌ను చర్చల పట్టికపైకి తీసుకురావడమే మునీర్ లక్ష్యం. భారత్ ఇప్పటివరకు దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా, చర్చలు జరపడానికి నిరాకరిస్తోంది" అని చౌదరి అన్నారు.

వివరాలు 

ఈసారి తూర్పు వైపు నుంచి మొదలవుతాం

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన "తదుపరి ఉగ్రదాడి జరిగితే భారత్ తక్షణమే సైనిక చర్యకు దిగుతుంది" అనే హెచ్చరికపై ప్రశ్నించగా, చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. "ఈసారి తూర్పు వైపు నుంచి మొదలవుతాం. వాళ్లూ అర్థం చేసుకోవాలి, వాళ్లను ఎక్కడైనా ఢీకొట్టవచ్చు" అని పేర్కొన్నారు. కానీ దాడులు ఎలా ఉంటాయన్న దానిపై వివరాల్లోకి వెళ్లలేదు. పహల్‌గాం ఉగ్రదాడికి ముందు మునీర్ ప్రకటన ఏప్రిల్ 16న ఆసిమ్ మునీర్ చేసిన ప్రసంగాన్ని చౌదరి మరోసారి ప్రస్తావించారు. ఆ ప్రసంగం అనంతరం కొన్ని రోజులకే జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రసంగంలో మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దాడికి ప్రేరణగా మారినట్టు భావిస్తున్నారు.

వివరాలు 

హిందువులు-ముస్లింలు మౌలికంగా వేరే వ్యక్తులు

ఆ ప్రసంగంలో మునీర్, "హిందువులు-ముస్లింలు మౌలికంగా వేరే వ్యక్తులు" అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాక, "కశ్మీర్ పాకిస్తాన్‌కు శిరోధార రక్తనాళిక" అని అభివర్ణించి, అక్కడ ప్రజల 'సంగర్షానికి' మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చాడు. "ఆ ప్రసంగంలో మునీర్ తన ఉద్దేశాలను స్పష్టంగా వెల్లడించాడు. తన జీవితాన్నే పణంగా పెట్టే విధంగా భావజాలాన్ని చెప్పాడు" అని చౌదరి పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు భారత్‌లో పెరుగుతున్న హిందూ జాతీయతాపరమైన భావజాలానికి మునీర్ చేసిన ప్రతిస్పందనగా కూడా చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.

వివరాలు 

దూకుడు ఎక్కువ..బజ్వాతో పోల్చితే తేడా స్పష్టమే 

మునీర్, తన పూర్వీకులు కమర్ జావెద్ బజ్వాతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు ఎకనమిస్ట్ విశ్లేషించింది. బజ్వా సందర్భంలో, భారత్‌తో మౌనం వహిస్తే, మునీర్ మాత్రం ప్రత్యక్ష దూకుడు వైఖరిని ఎంచుకున్నాడు. ఇంతవరకూ భారత్ సాగించిన దౌత్య ప్రయత్నాల్లో కూడా మునీర్ ద్వేషపూరిత విధానమే ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. ఇంతకుముందు భారత్ చేసిన 'ఆపరేషన్ సిందూర్' వైమానిక దాడులపై అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ మునీర్ వెనకడుగు వేయలేదని నివేదిక చెబుతోంది. దీంతో, మునీర్ దృష్టి పూర్తిగా భారత్‌పైనే కేంద్రీకృతమైందని స్పష్టమవుతోంది.

వివరాలు 

పాకిస్తాన్‌లో 'ఆసిమ్ లా' చర్చలు.. అధ్యక్ష పదవిపై ఊహాగానాలు 

పాకిస్తాన్‌లో మునీర్ ప్రాచుర్యం విస్తరిస్తోంది. ప్రస్తుతం సైన్యం మద్దతుతో ఉన్న ప్రభుత్వం పార్లమెంట్‌లో 2/3 మెజారిటీతో ఉన్నందున రాజ్యాంగ సవరణలు సులభమవుతున్నాయి. దీన్ని బట్టి మునీర్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, చౌదరి మాత్రం ఈ వాదనలను పూర్తిగా నిరాకరించాడు.కానీ వాస్తవంగా చూస్తే, మునీర్ అధికారాన్ని ఎవరూ విస్మరించలేరు. మే నెలలో ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ పొందిన మునీర్, పాకిస్తాన్ సైనిక పాలకుల్లో అరుదైన గౌరవాన్ని సాధించాడు. ఈ నేపథ్యంలో, 'ఆసిమ్ లా' అనే పదం ప్రజల్లో వినిపిస్తోంది. దీని అర్థం - అధికారికంగా మిలిటరీ పాలన లేదు కానీ, అధిపత్యం మాత్రం మునీర్‌దే.

వివరాలు 

పశ్చిమ దేశాల్లో శిక్షణలేని తొలి ఆర్మీ చీఫ్ 

ఆసిమ్ మునీర్ స్వభావం గత జనరల్స్‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంది. ఒక ఇమామ్ కొడుకుగా జన్మించిన మునీర్, మరదర్సాలో విద్యాభ్యాసం చేసి ఖురాన్‌ను పూర్ణంగా మౌఖికంగా పఠించగలడు. పశ్చిమ దేశాల్లో శిక్షణ పొందని తొలి ఆర్మీ చీఫ్ ఆయనే కావడం గమనార్హం. అయినప్పటికీ, ఆయన ప్రపంచ రాజకీయాలపై మంచి అవగాహన కలిగి ఉన్నాడని చౌదరి అంటున్నారు. పైగా, పాక్ భూభాగంలో జిహాదీ గ్రూపులకు తీవ్ర వ్యతిరేకత కూడా చూపిస్తున్నారని చెబుతున్నారు.

వివరాలు 

చైనాతో సంబంధాలపై ప్రశ్నార్థకమే 

మునీర్ ప్రస్తుతం అమెరికాతో సంబంధాలు తిరిగి మెరుగుపరచే దిశగా కృషి చేస్తున్నాడు. ట్రంప్‌తో భోజనం,ఆయిల్ డీల్ వంటి అంశాలు ఈ దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఇది చైనాతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి భంగం కలిగించదని పాక్ చెబుతున్నప్పటికీ, బీజింగ్ అలా భావిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే,మునీర్ దృష్టి ప్రస్తుతం పూర్తిగా భారత్‌పైనే కేంద్రీకృతమై ఉంది. కాశ్మీర్‌ను దాటి మరింత లోతుగా భారత్‌లోకి దాడులు చేసే అవకాశాన్ని ఆయన ప్రతినిధి మరోసారి హెచ్చరిస్తున్నాడు. భారత ప్రధాని మోదీ కూడా ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని,"భవిష్యత్తులో భారత్‌లో ఏ ఉగ్రదాడైనా యుద్ధం ప్రకటనగా పరిగణిస్తాం"అంటూ హెచ్చరించారు. ఇది పాక్ ఉగ్రవాదం విషయంలో భారత్ కొత్త రూటును ఎంచుకున్నదన్న సంకేతం.