Astrologer Amy Tripp: బైడెన్ నిష్క్రమణను సరిగ్గా అంచనా వేసిన జ్యోతిష్కురాలు.. తదుపరి US అధ్యక్షుడి పేరును కూడా వెల్లడించింది
ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ నిష్క్రమించే ఖచ్చితమైన తేదీని జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు. దాంతో ఆమె పేరు మారుమోగిపోయింది.ఇప్పుడు అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరన్నదానిపై ఆమె జోస్యం చెప్పారు. 'డొనాల్డ్ ట్రంప్‌కు సూర్యుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు.ఈసారి గెలుపు ట్రంప్‌దే' అంటూ ట్రిప్ చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అమీ ట్రిప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బయోలో తనను తాను'ఇంటర్నెట్ లోఅత్యంత ప్రసిద్ధ జ్యోతిష్కురాలిగా'నిర్వచించుకుంది. అంతేకాదు,''కమలా హారిస్ శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారని.. నాలుగేళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారు'' అని ఆగస్ట్ 11, 2020లోనే చెప్పారు. ఇప్పుడు ఆ మాట కూడా నిజమైంది.
డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలతో అమెరికాలో రాజకీయ అనిశ్చితి
అమీ ట్రిప్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రలాజికల్ రీసెర్చ్ (ISAR) నుంచి జ్యోతిష్యంలో సరిఫికేషన్ ఉంది. ఆమె లైసెన్స్‌డ్ థెరపిస్ట్ కూడా. నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోకాస్మిక్ రీసెర్చ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్‌లలో క్రియాశీలకంగా ఉన్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జో బైడెన్ జూలై 21న అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారు అని అమీ జూలై 11వ తేదీన చెప్పారు. ఆమె చెప్పింది చెప్పినట్టుగా అలాగే జరిగింది. ''ఈసారి ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నిక అయ్యాక అయన అనూహ్య నిర్ణయాలతో అమెరికాలో రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చు'' అని అమీ చెప్పారు. ఆగస్టులో ప్రచారం, రాజకీయాల్లో విపరిణామాలు చోటుచేసుకుంటాయని కూడా హెచ్చరించారు!