LOADING...
Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి

Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖతార్‌లో నివాసముంటున్న ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటనపై దోహాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. విహారయాత్ర నిమిత్తం ఖతార్‌ నుంచి 28 మంది ప్రవాస భారతీయుల బృందం కెన్యా వెళ్లింది. ఈ బృందం కెన్యాలోని నయాందారూ కౌంటీలోని ఒల్ జొరోరోక్-నకూరూ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలాన్ని తెలుసుకున్న నైరోబీలోని భారత హైకమిషన్‌ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

వివరాలు 

మృతుల్లో ఐదుగురు కేరళకు చెందినవారు 

దుర్ఘటన అనంతరం మృతదేహాల తరలింపు,క్షతగాత్రులకు చికిత్స అందించే కార్యక్రమాల్లో అధికారులు నిమగ్నమయ్యారని దోహాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈబస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయిందని'ది గల్ఫ్ టైమ్స్‌'వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. చనిపోయిన ఐదుగురు ప్రయాణికుల వివరాలు ఈవిధంగా ఉన్నాయి: మృతుల్లో ఐదుగురు కేరళకు చెందినవారిగా గుర్తించారు. మావెలిక్కరకు చెందిన గీతా షోజి ఐజాక్ (58),జస్నా కుట్టిక్కట్టుచలిల్(29),18 నెలల రూహి మెహ్రీ ముహమ్మద్,ఒట్టప్పలంకు చెందిన రియా ఆన్ (41)ఎనిమిదేళ్ల చిన్నారి టైరా రోడ్రిగ్స్‌ మృతి చెందారు. రియా భర్త జోయెల్,వారి పెద్ద కుమారుడు రవిస్(14)ప్రమాదంలో గాయపడి నయాందారూలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన భారతీయులను సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం