US Elections 2024: కమలాహారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ప్రచారం.. ట్రంప్‌ను ఓ 'బంబ్లింగ్' బిలియనీర్..
వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలో ప్రచార సభ నిర్వహించారు. ఆ సభలో ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజల జీవితాలను మెరుగుపరిచే నాయకుడు కావాలి: ఒబామా
"ప్రజలు నిరుత్సాహంతో ఉన్నారని నాకు అర్థమైంది. ఈ ఎన్నికలు చాలా కఠినంగా ఉండనున్నాయి, ఎందుకంటే చాలా మంది అమెరికన్లు ఇంకా సమస్యలతో పోరాడుతున్నారు. ట్రంప్ మీకు సహాయం చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థంకావడం లేదు. ఆయన తన అహం, డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తారు. సమస్యలను పరిష్కరించుకుంటూ, ప్రజల జీవితాలను మెరుగుపరిచే నాయకుడు కావాలి. కమలా హారిస్ మాత్రమే అది చేయగలరని నేను నమ్ముతున్నాను" అని ఒబామా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతు ఇచ్చారు. ఈ పరిణామంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా కమలా హారిస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.