Page Loader
హమాస్‌, రష్యా ఇద్దరి ఎజెండా ఒకటే : బైడెన్‌ కీలక వ్యాఖ్యలు
హమాస్‌, రష్యా ఇద్దరి ఎజెండా ఒకటే : బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

హమాస్‌, రష్యా ఇద్దరి ఎజెండా ఒకటే : బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2023
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి ఇజ్రాయెల్‌ నుండి అమెరికన్లను వెనుకకు తీసుకురావడానికి అధ్యక్షుడు జో బైడెన్ గురువారం అత్యవసర మిషన్‌ను ప్రారంభించారు. యుద్ధం చేస్తున్న రెండు ప్రధాన మిత్రదేశాలు(ఇజ్రాయెల్‌, ఉక్రెయిన్‌)కు తమ మద్దతు ఎప్పటికి ఉంటుందని స్పష్టం చేశారు. ఓవల్ ఆఫీస్ నుండి బైడెన్ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, ఇజ్రాయెల్‌పై దాడి చేసిన గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ల ఎజెండా ఒకటే అన్నారు. ఇజ్రాయెల్‌ పర్యటన నుండి తిరిగి వచ్చిన బైడెన్ మాట్లాడుతు రష్యా నుండి ఉక్రెయిన్‌, హమాస్ మిలిటెంట్ల నుండి ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం అమెరికా ప్రయోజనాలకు కీలకమని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బైడెన్ కీలక ప్రసంగం