Donald Trump: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు బైడెనే నిధులిచ్చారు: ట్రంప్ సంచలన ఆరోపణలు
ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల భీకర దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌పై దాడులకు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరోక్షంగా హమాస్‌ను నిధులు ఇచ్చారంటూ సంచలన ఆరోపణలను చేశారు. హమస్ జరిపిన దాడులు చాలా అవమానకరమైనవని, ఇజ్రాయెల్ ఉన్న శక్తిసామర్థ్యాలతో స్వీయ రక్షణ చేసుకొనే అన్ని హక్కులు ఉన్నాయని ఉద్ఘాటించారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులతో ఈ దాడులకు నిధులు అందడం అత్యంత అవమానకరమని, బైడెన్ యంత్రాంగం నుంచి బయటికొచ్చిన పలు నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని ట్రంప్ ఆరోపణలను గుప్పించాడు.
ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డ అండ్య్రూ బేట్స్
ట్రంప్ వ్యాఖ్యలను వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అండ్య్రూ బేట్స్ కొట్టిపారేశాడు. ఇది సిగ్గుమాలిన అబద్ధమని సోషల్ మీడియా వేదికగా ఆయన విమర్శించారు. ఆహార, మెడిసిన్ లాంటి మానవ అవసరాల కొనుగోలు మాత్రమే డబ్బులు ఉపయోగించామని చెప్పారు. ఇక ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచే విషయంలో అమెరికా రెండు పక్షాలు ఒక్కటిగా నిలవాల్సి ఉందని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా, హమాస్ ఉగ్రవాదులు వంద మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను అపహరించినట్లు టెల్అవీవ్ తెలిపింది. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ 'హెజ్బొల్లా' ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అయితే ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టనట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి.