Page Loader
Mary Millben: నితీశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్ .. బిహార్ బీజేపీ సారథిగా మహిళాని నియమించాలని విజ్ఞప్తి
Mary Millben: 'నితీశ్‌ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్..బీజేపీ సారథిగా మహిళాకే పట్టం'

Mary Millben: నితీశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్ .. బిహార్ బీజేపీ సారథిగా మహిళాని నియమించాలని విజ్ఞప్తి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 09, 2023
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికన్ గాయకురాలు, ఆఫ్రికన్-అమెరికన్ నటిమణి మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కనుక భారతీయ పౌరురాలిగా ఉండుంటే నితీశ్ రాజీనామాకు పట్టుబట్టేదాన్ని అని పేర్కొన్నారు. బీహార్ సీఎంగా పోటీ చేసేదాన్నని తెలిపారు. ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకిన మిల్బెన్ అందరిని ఆకర్షించారు. బీహార్ ప్రజలారా, భారత ప్రజలారా.. మహిళకు ఓటువేసే శక్తి, మార్పునకు ఓటేసే శక్తి మీకు ఉందన్నారు. బీహార్‌లో నాయకత్వానికి ఓ మహిళకు అవకాశం కల్పించాలని బీజేపీని కోరారు. జవాన్ సినిమాలో షారూఖ్‌ ఖాన్ చెప్పిన రీతిలో ఓటుతోనే మార్పు తీసుకురావాలని మిల్బెన్ అభ్యర్థించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీకి విజ్ఞప్తి చేసిన అమెరికన్ సింగర్