LOADING...
Eileen Wang: చైనా తరఫున అక్రమంగా పనిచేసిన ఆరోపణలు.. కాలిఫోర్నియా మేయర్ రాజీనామా
చైనా తరఫున అక్రమంగా పనిచేసిన ఆరోపణలు.. కాలిఫోర్నియా మేయర్ రాజీనామా

Eileen Wang: చైనా తరఫున అక్రమంగా పనిచేసిన ఆరోపణలు.. కాలిఫోర్నియా మేయర్ రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్కడియా ప్రాంత మేయర్‌గా పనిచేసిన ఐలీన్ వాంగ్‌పై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆమెపై అభియోగాలు నమోదు చేసింది. 58 ఏళ్ల ఐలీన్ వాంగ్ 2022లో ఆర్కడియా నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికలకు ముందే ఆమె చైనా ప్రభుత్వానికి రహస్యంగా సహకరించినట్లు ఎఫ్‌బీఐ గుర్తించింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అక్రమ ప్రతినిధిగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

వివరాలు 

కీలక విషయాలను అంగీకరించిన ఐలీన్ వాంగ్

చైనాకు చెందిన భావజాలాన్ని ప్రచారం చేసే విధంగా'యూఎస్ న్యూస్ సెంటర్'పేరుతో ఆమె ఓ వార్తా వెబ్‌సైట్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా 2020 నుంచి 2022 వరకు ఆ వెబ్‌సైట్ ద్వారా చైనా ప్రభుత్వానికి అనుకూలప్రచారం విస్తృతంగా సాగినట్లు వెల్లడించారు. చైనా ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా అక్కడి అధికారుల సూచనలమేరకు కార్యకలాపాలు నిర్వహించినట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. ఈకేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణలో ఐలీన్ వాంగ్ కీలక విషయాలను అంగీకరించారు. చైనా ప్రభుత్వ అధికారుల సూచనల ప్రకారం వార్తావెబ్‌సైట్ నడిపినట్లు ఆమె ఒప్పుకున్నారు. ఈపరిణామాల మధ్య మేయర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈకేసులో ఆరోపణలు రుజువైతే ఆమెకు దాదాపు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని అమెరికా మీడియా వెల్లడించింది.

Advertisement