Justin Trudeau: రాజీనామా యోచనలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం.
లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవి నుంచి కూడా ఆయన తప్పుకునే అవకాశముందని సన్నిహిత వర్గాల సమాచారం ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
నేషనల్ కాకస్ సమావేశానికి ముందే ట్రూడో రాజీనామా చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
జస్టిన్ ట్రూడో 2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.
లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంపై ఆయన కార్యాలయం స్పందిస్తే మాత్రమే దీనిపై స్పష్టత రానుంది.
వివరాలు
జస్టిన్ ట్రూడో విధానాలపై విమర్శలు
అయితే, జస్టిన్ ట్రూడో తక్షణంగా రాజీనామా చేస్తారా లేక కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోర పరాజయం చెందుతుందని అనేక ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, జస్టిన్ ట్రూడో విధానాలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా, దేశ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేసిన నెల రోజులకే ట్రూడో కూడా రాజీనామా చేసే అవకాశం ఉందనే వార్తలు తెరపైకి వచ్చాయి.