LOADING...
కీలక ప్రకటన చేసిన చైనా.. 2022 G-20 డిన్నర్‌లో మోదీ, జిన్‌పింగ్ ఏం మాట్లాడారో తెలుసా? 
చైనా కీలక ప్రకటన

కీలక ప్రకటన చేసిన చైనా.. 2022 G-20 డిన్నర్‌లో మోదీ, జిన్‌పింగ్ ఏం మాట్లాడారో తెలుసా? 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 28, 2023
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ఏడాది 2022లో జరిగిన G-20 దేశాల డిన్నర్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏం మాట్లాడుకున్నారో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ప్రపంచ దేశాలను సైతం ఈ కలయిక ఆకర్షించింది. తాజాగా జీ-20 విందులో ఇరు దేశాధినేతల మాటామంతీపై డ్రాగన్ దేశం కీలకమైన ప్రకటన చేసింది. ఇండో - చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడంపై మోదీ, జిన్‌పింగ్ లు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తాజాగా ప్రకటించింది. ఇండోనేషియాలోని బాలిలో 2022లో జరిగిన G-20 శిఖరాగ్ర సమావేశంలో దిగ్గజ దేశాధినేతలు మర్యాదపూర్వకంగా పరస్పరం సంభాషించుకుని కరచాలనం చేసుకున్నారని చైనా పేర్కొంది.

details

ఇరుదేశాల మధ్య సంబంధాలను సుస్థిరం చేసుకోవాల్సిన ఆవశ్యకతపై దేశాధినేతల చర్చలు

ఇరుదేశాల మధ్య సంబంధాలను సుస్థిరం చేసుకోవాల్సిన ఆవశ్యకతపై మాట్లాడినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ (MINISTRY OF EXTERNAL AFFAIRS) గురువారం వివరించింది. రెండు రోజుల క్రితం, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ (NSA) అజిత్ దోవల్, చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యిలు బ్రిక్స్ సమ్మిట్ లో భాగంగా సమావేశమై కీలక చర్చలు చేశారు. తాజాగా జి-20 శిఖరాగ్ర సమావేశంలో పరస్పర ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరణపై చైనా విదేశాంగ శాఖ ప్రకటన కీలకంగా మారింది. భారత్ - చైనా సరిహద్దులోని పశ్చిమ సెక్టార్‌లో వాస్తవ నియంత్రణ రేఖ( LAC ) వెంట పరిస్థితిని పరిష్కరించడం, సరిహద్దులో శాంతి, సుస్థిరతను పునరుద్ధరించడంతో ఇరుదేశాల సంబంధాలు బలోపేతం కానున్నట్లు తెలుస్తోంది.