Page Loader
China Submarine : పాకిస్థాన్ హార్బ‌ర్‌లో చైనా స‌బ్‌మెరైన్‌, యుద్ధనౌక‌లు.. కారణమేంటో తెలుసా
పాకిస్థాన్ హార్బ‌ర్‌లో చైనా స‌బ్‌మెరైన్‌, యుద్ధనౌక‌లు

China Submarine : పాకిస్థాన్ హార్బ‌ర్‌లో చైనా స‌బ్‌మెరైన్‌, యుద్ధనౌక‌లు.. కారణమేంటో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 13, 2023
06:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని క‌రాచీ హార్బ‌ర్‌లో చైనాకు చెందిన యుద్ధ‌ నౌక‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. హై రెజ‌ల్యూష‌న్ శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఈ విష‌యం బహిర్గతమైంది. చైనా, పాక్ మ‌ధ్య భారీ స్థాయిలో నౌకాద‌ళ సీ గార్డియ‌న్‌-3 విన్యాసాలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ దృశ్యం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇటీవ‌లే హిందూ మ‌హాస‌ముద్రంలో చైనా యుద్ధ నౌక‌లు కాపలా కాస్తున్నాయి. బంగాళాఖాతంలో షియాన్ 6 రీస‌ర్చ్ షిప్ రౌండ్లు కొట్టింది. క‌రాచీలో ఉన్న స‌బ్‌మెరైన్‌ను టైప్ 039 డీజిల్ ఎల‌క్ట్రిక్ స‌బ్‌ మెరైన్‌గా మీడియా గుర్తించింది. మరోవైపు 2013 త‌ర్వాత భార‌త జ‌లాల్లోకి చైనా ఎనిమిదోసారి త‌న జ‌లాంత‌ర్గామిని తీసుకువ‌చ్చింది.

details

5 బిలియన్ డాలర్ల ఒప్పందం

మ‌లాక్కా సంధి రూట్లో టైప్‌-039 స‌బ్‌మెరైన్ వెళ్తున్న స‌మ‌యంలో నేవీ పీ8 విమానాలు గుర్తించినట్లు వార్తలు ప్రసారం అయ్యాయి. చైనా నుంచి 8 టైప్ 039 స‌బ్‌మెరైన్ల‌ను కొనుగోలుకు పాకిస్థాన్ సర్కార్ 2015లో కుదుర్చుకున్న ఒప్పందం కొనుగోలు ఖ‌రీదు 5 బిలియ‌న్ల డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో క‌రాచీ షిప్‌యార్డులోనే నాలుగు జ‌లాంత‌ర్గాముల‌ను నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఇప్ప‌టికీ ఎటువంటి స‌బ్‌మెరైన్‌ను డెలివరీ చేయ‌లేదు.ప్ర‌స్తుతం క‌రాచీలో 926 ర‌కం జ‌లాంత‌ర్గామి ఉన్న‌ట్లు శాటిలైట్ ఇమేజ్‌లు బహిర్గతం చేశాయి. క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో రెస్క్యూ ఆప‌రేష‌న్ సైతం చేప‌ట్ట‌గ‌లిగే సామర్థ్యం ఈ జలాంతర్గామికి ఉంది. క‌రాచీలో టైప్ 52డీ డెస్ట్రాయ‌ర్‌, టూ టైప్ 54 ఫ్రిగేట్స్‌, టైప్‌-903 రిప్లెనిస్‌మెంట్ ఆయిల‌ర్ లాంటి జలాంతర్గాములు ఉండటం గమనార్హం.