Page Loader
Feitian 2 Hypersonic Missile: హైపర్‌సోనిక్ టెక్నాలజీలో ఫీటియన్ 2 ప్రయోగం ద్వారా గ్లోబల్ పోటీలో చైనా ముందంజ 
హైపర్‌సోనిక్ టెక్నాలజీలో ఫీటియన్ 2 ప్రయోగం ద్వారా గ్లోబల్ పోటీలో చైనా ముందంజ

Feitian 2 Hypersonic Missile: హైపర్‌సోనిక్ టెక్నాలజీలో ఫీటియన్ 2 ప్రయోగం ద్వారా గ్లోబల్ పోటీలో చైనా ముందంజ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా హైపర్‌సోనిక్ సాంకేతికత అభివృద్ధిలో మరో ముందడుగు వేసింది. దేశ వాయవ్య ప్రాంతంలో 'ఫీటియన్ 2' అనే హైపర్‌సోనిక్ వాహనాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ వాహనం ప్రయాణించేటప్పుడు అత్యంత క్లిష్టంగా భావించే విభిన్న ప్రొపల్షన్ విధానాల మధ్య మార్పును సమర్థవంతంగా నిర్వహించగలగడం ద్వారా చైనా కీలక విజయాన్ని నమోదు చేసింది. హైపర్‌సోనిక్ వ్యవస్థల అభివృద్ధిలో ఇది కీలక ఘట్టంగా భావించబడుతుంది. దీనితో పాటు, అమెరికా వంటి దేశాలకు గట్టి పోటీని ఇవ్వగల సామర్థ్యాన్ని చైనా ప్రదర్శించింది.

వివరాలు 

అభివృద్ధిలో భాగస్వాములు 

ఫీటియన్ 2 ను షాన్‌షీ ప్రావిన్స్‌లోని నార్త్‌వెస్ట్రన్ పొలీటెక్నికల్ యూనివర్సిటీ, ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ప్రొపల్షన్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ కలిసి అభివృద్ధి చేశారు. ఇది 2022లో పరీక్షించిన ఫీటియన్ 1 ఆధారంగా రూపొందించబడింది. తాజా ప్రయోగం ద్వారా రాకెట్ ఆధారిత కంబైన్డ్ సైకిల్ (RBCC) ఇంజిన్ సాంకేతికతలో చైనా మరింత పురోగతి సాధించింది. వేగవంతమైన ప్రొపల్షన్ వ్యవస్థలపై, ఏరోడైనమిక్స్ రంగంలో విలువైన సమాచారం అందుకుంది.

వివరాలు 

ఇంధన వ్యవస్థలో ప్రత్యేకత 

ఫీటియన్ 2 లో ప్రధానంగా రాకెట్ బేస్డ్ కంబైన్డ్ సైకిల్ ఇంజిన్‌ను వినియోగించారు. ఇది కెరోసిన్,హైడ్రోజన్ పెరాక్సైడ్ మిశ్రమాన్ని ఇంధనంగా ఉపయోగిస్తుంది. ఇది సాంప్రదాయ హైపర్‌సోనిక్ వాహనాల తరహాలో లిక్విడ్ ఆక్సిజన్ వంటి క్రయోజెనిక్ ఇంధనంపై ఆధారపడదు. వాతావరణ ఆక్సిజన్‌ను ప్రయాణ సమయంలోనే వినియోగించడం ద్వారా, వాహనంపై ఆక్సిడైజర్ భారం తగ్గుతుంది. తద్వారా, ఇంధన సామర్థ్యం మెరుగవుతుంది, ప్రయాణ సామర్థ్యంలోనూ స్థిరత్వం వస్తుంది.

వివరాలు 

ప్రొపల్షన్ మార్పులో విజయం 

ఈ ప్రయోగంలో టేకాఫ్ సమయంలో వాహనం ఇజెక్టర్ మోడ్‌లో రాకెట్ త్రస్ట్‌తో ప్రయాణం ప్రారంభించింది. అనంతరం ఎయిర్ బ్రీదింగ్ టెక్నాలజీ ఆధారిత ర్యామ్జెట్ మోడ్‌కు సాఫీగా మారగలగింది. హైపర్‌సోనిక్ ప్రయాణాల్లో ఇది అత్యంత కీలక అంశంగా భావించబడుతుంది. అంతేకాకుండా, ఇంజిన్ వేరియబుల్ జియోమెట్రీ ఇన్‌టేక్ సాంకేతికతను కూడా పరీక్షించారు. ఇది వేగం, ఎత్తు మారినప్పుడు కూడా ఎయిర్‌ఫ్లో నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించగలగడం నిరూపితమైంది.

వివరాలు 

నూతన డిజైన్ అప్‌గ్రేడ్‌లు 

ఫీటియన్ 2 రూపకల్పనలో పలు నవీకరణలు చేశారు. పెద్ద టెయిల్ ఫిన్స్, కొత్త రకం వింగ్స్ వాహనం ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఇవి అధిక వేగం,ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు వాహన స్థిరత్వం, నియంత్రణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా నిలిచాయి. స్వయంచాలకంగా పని చేసే వ్యవస్థ ఈ ప్రయోగం ద్వారా ఫీటియన్ 2 వాహనం స్వయంచాలకంగా పని చేసే సామర్థ్యాన్ని కూడా చైనా చూపించింది. వాహనం మిషన్ అవసరాలు, పరిసర వాతావరణాన్ని బట్టి యాంగిల్ ఆఫ్ అటాక్‌ను స్వయంగా సర్దుబాటు చేసుకోగలిగింది. ఇది భవిష్యత్‌లో మిలిటరీ, శాస్త్రీయ రంగాల్లో నడిచే అన్‌మాన్డ్ హైపర్‌సోనిక్ వ్యవస్థల అభివృద్ధికి దోహదం చేస్తుంది.

వివరాలు 

కిరోసిన్-హైడ్రోజన్ పెరాక్సైడ్ మిశ్రమ వినియోగం 

ఫీటియన్ 2 వాహనంలో కిరోసిన్-హైడ్రోజన్ పెరాక్సైడ్ మిశ్రమాన్నిఇంధనంగా వినియోగించడం ఒక ప్రత్యేకత. కిరోసిన్‌కు లిక్విడ్ హైడ్రోజన్‌తో పోల్చితే తక్కువ శక్తి ఉన్నా,దాన్ని నిల్వ చేసుకోవడం, వినియోగించడంలో ఉన్న సౌలభ్యం వాహనం డిజైన్‌ను మరింత సులభతరం చేసింది. దీనివల్ల గాఢ శీతలీకరణ వ్యవస్థల అవసరం తక్కువైంది. ఇంధన మార్పు ద్వారా తక్కువ బరువు, స్థిరత ఫీటియన్ 1లో కెరోసిన్ ఆధారిత హైపర్‌సోనిక్ ఇంజిన్‌ను పరీక్షించి,ఫలితాల ఆధారంగా ఫీటియన్ 2లో హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను కలిపారు. ఇది వాహనం బరువును తగ్గించి, త్రస్ట్‌ను స్థిరంగా ఉంచడంలో సహాయపడింది. ఈ విధానం భవిష్యత్ హైపర్‌సోనిక్ వాహనాల నిర్మాణానికి, ఆపరేషన్ విధానానికి ప్రభావవంతమైన మార్గంగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

గ్లోబల్ హైపర్‌సోనిక్ పోటీలో చైనా ఆధిక్యం 

ఈ ప్రయోగం ద్వారా చైనా, గ్లోబల్ హైపర్‌సోనిక్ టెక్నాలజీ పోటీలో ముందంజలో నిలిచింది. ప్రయాణ సమయంలో ప్రొపల్షన్ మార్పులు, స్వయంచాలిత వ్యవస్థల సమర్థత, ఎయిర్‌ఫ్లో నియంత్రణ వంటి అంశాల్లో సాంకేతికంగా గొప్ప విజయాన్ని సాధించింది. ఇది రక్షణ, పౌర రంగాల్లో వేగవంతమైన రవాణా వ్యవస్థలు, అత్యవసర స్పందన ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధికి మార్గదర్శకంగా మారనుంది.