Page Loader
Vivek Ramaswamy: మస్క్‌తో విభేదాలు.. వివేక్‌ రామస్వామి ఏమన్నారంటే?
మస్క్‌తో విభేదాలు.. వివేక్‌ రామస్వామి ఏమన్నారంటే?

Vivek Ramaswamy: మస్క్‌తో విభేదాలు.. వివేక్‌ రామస్వామి ఏమన్నారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ నుంచి తన రాజీనామా పై వివేక్ రామస్వామి స్పందించారు. తాను ఎలాన్ మస్క్‌తో విభేదాల కారణంగా డోజ్ నుంచి వైదొలిగినట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రభుత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దేందుకు తమ ఇద్దరి విధానాలు వేర్వేరుగా ఉన్నా, ఒకే లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. మస్క్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేయాలని విశ్వసిస్తారని, తాను రాజ్యాంగం ఆధారిత విధానాలను నమ్ముతానని స్పష్టం చేశారు. మస్క్‌ టెక్నాలజీ వైఖరితో భవిష్యత్తు ఆలోచనను ముందుకు తీసుకెళ్తుంటే, తాను రాజ్యాంగ బలోపేతం పట్ల అంకితభావంతో ఉన్నానన్నారు. రాష్ట్రాలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు.

Details

2026లో ఒహైయో గవర్నర్ ఎన్నికలు 

దేశాన్ని రక్షించడం ఎవరైతే అవసరమని భావిస్తారో, వారు కలిసి పనిచేయాలన్నారు. డోజ్‌ను ట్రంప్‌ నామినేట్ చేసినప్పుడు, వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్ కలిసి నాయకత్వం వహించారు. ఈ సంస్థ ప్రభుత్వ వ్యవస్థను సమూలంగా మార్చడం, వృథా ఖర్చులను తగ్గించడం వంటి లక్ష్యాల కోసం పనిచేస్తోంది. 2026 జులై 4న అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఈ లక్ష్యాలు పూర్తి చేయాలని డోజ్‌ ప్రణాళిక రూపొందించింది. వివేక్ రామస్వామి తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణం కోసం డోజ్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఒహైయో గవర్నర్ ఎన్నికలు నవంబర్ 2026లో జరగనున్నాయి.

Details

ట్రంప్ విజయానికి కృషి

గవర్నర్‌గా పోటీ చేయడానికి రామస్వామి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతకుముందు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలబడేందుకు రామస్వామి శ్రమించినా విజయం సాధించలేకపోయారు. అయితే డొనాల్డ్ ట్రంప్ విజయానికి మద్దతుగా తన శక్తి మొత్తం వినియోగించారు. ఈ విధంగా తన రాజీనామా, భవిష్యత్తు ప్రణాళికలపై వివేక్‌ రామస్వామి చర్చనీయాంశాలను స్పష్టంగా తెలిపారు.