Trump Rally Shooting: అమెరికాలో హింసకు చోటు లేదు: బైడెన్
డొనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదని అన్నారు. జో బైడెన్ మాట్లాడుతూ, 'సంఘటన తర్వాత అన్ని ఏజెన్సీలు నాకు సమాచారం ఇచ్చాయి. నేను ట్రంప్‌తో మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ అయన ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అమెరికాలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు.మన దేశప్రజలందరూ ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది.దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి మేము అనుమతించము . మా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ధన్యవాదాలు. ఎలాంటి సమస్య లేకుండా శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహించాల్సి ఉందని, అమెరికాలో ఇలాంటి హింస అస్సలు సరికాదన్నారు.నేను డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన వెంటనే మీకు తెలియజేస్తాను. అయితే ప్రస్తుతం అయన సురక్షితంగా ఉన్నాడు'.
ఇది అసహ్యకరమైన చర్య : హారిస్
ట్రంప్ ర్యాలీపై కాల్పుల ఘటనపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా స్పందించారు.ఈ నీచమైన చర్యను మనమంతా ఖండించాలని అన్నారు. శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు,రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన ఘోరమైన దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.అమెరికాలో పార్టీలకు అతీతంగా నేతలంతా ట్రంప్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ),ఇతర ఏజెన్సీలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ట్రంప్‌ను బయటకు తీసుకెళ్తుండగా ఆయన మద్దతుదారులు పిడికిలి బిగించి నినాదాలు చేశారు. పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు ఉత్తరాన 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ట్రంప్‌పై దాడి జరిగింది.