Page Loader
Trump: ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆలా జరిగితే కెనడాకు 'గోల్డెన్ డోమ్' ఉచితం
ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆలా జరిగితే కెనడాకు 'గోల్డెన్ డోమ్' ఉచితం

Trump: ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆలా జరిగితే కెనడాకు 'గోల్డెన్ డోమ్' ఉచితం

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ దగ్గరకి రాకుండా అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి 'గోల్డెన్ డోమ్‌ (Golden Dome)' అనే పేరును పెట్టారు. ఈ అగ్రరాజ్యం ప్రతిపాదించిన ఈ అత్యున్నత రక్షణ ప్రణాళికపై ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో అమెరికాకు పొరుగుదేశమైన కెనడా ఆసక్తిని చూపుతోంది.

వివరాలు 

రక్షణ వ్యవస్థ కోసం 61 బిలియన్ డాలర్లు

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. కెనడా ఈ ప్రాజెక్టులో చేరాలని భావిస్తే, తమ దేశాన్ని అమెరికా 51వ రాష్ట్రంగా విలీనం చేసుకోవాలని సూచించారు. అలా జరిగినట్లయితే, గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థను కెనడాకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. అయితే, కెనడా అమెరికాలో విలీనం కావడం అసాధ్యమైతే.. ఆ రక్షణ వ్యవస్థ కోసం 61 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మరోసారి విలీన డిమాండ్‌ను లేవనెత్తిన ట్రంప్