Donald Trump: అమెరికా నూతనాధ్యక్షుడిగా నేడే ట్రంప్ ప్రమాణస్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30) తన పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమం కోసం ట్రంప్ తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు ప్రత్యేక సైనిక విమానంలో చేరారు.
నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనం వద్ద చేసిన హంగామా ఇంకా గుర్తుండే అంశం.
అయితే ఈసారి ప్రమాణ స్వీకార వేడుకను ప్రపంచ నేతలు కూడా సందర్శించనున్నారు.
చలి తీవ్రత కారణంగా ఈ వేడుకను క్యాపిటల్ భవనం లోపల నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదే విధంగా రొనాల్డ్ రీగన్ 1985లో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా చలివలన లోపలే వేడుక నిర్వహించాల్సి వచ్చింది.
వివరాలు
ట్రంప్ విధానాలకు వ్యతిరేక నిరసనలు
ఇలాంటి పరిస్థితి 40 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపిస్తోంది.
ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు వాషింగ్టన్‌లో నిరసనలు చేపట్టనున్నారు.
ఈ నిరసనకారులు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలానే నిరసనలు వ్యక్తమయ్యాయి.
పదవీ ప్రారంభం రోజే కీలక నిర్ణయాలు
తన తొలి రోజునే ప్రభావం చూపించేలా ట్రంప్ సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ఈ ఉత్తర్వుల ఉద్దేశం.
ఇందులో ముఖ్యంగా:
దక్షిణ సరిహద్దులను మూసివేయడం.
అక్రమ వలసదారులను వెనక్కి పంపడం.
ట్రాన్స్‌జెండర్ హక్కులను సవాలు చేయడం.
చమురు పరిశోధనల్ని పెంచడం.
వివరాలు
క్యాపిటల్ భవనం ఘటనలో దోషులకు క్షమాభిక్ష
క్యాపిటల్ భవనం ఘటనలో దోషులైన 1,500 మందికి క్షమాభిక్ష ప్రకటించడం.
ట్రాన్స్‌జెండర్లను అమెరికా సైన్యంలో నిషేధించాలనే నిర్ణయం వల్ల 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.
పలు విదేశీ దేశాలపై అదనపు సుంకాలు విధించే అంశం కూడా ఈ ఉత్తర్వుల్లో భాగమవుతుందని సమాచారం.
వివరాలు
భారత్, చైనా పర్యటనలు
పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తర్వలోనే భారత్, చైనాల పర్యటనలను ప్రారంభించే అవకాశాలున్నాయి.
ఈ అంశంపై ట్రంప్ తన సలహాదారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
వైట్ హౌస్‌లో జరుగనున్న ప్రభుత్వాధినేతల సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించే అవకాశం ఉంది.
ఆ సమయానికే ట్రంప్ భారత్ పర్యటనకు వస్తారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు చైనా తరఫున ఉపాధ్యక్షుడు హన్ ఝెంగ్ హాజరుకానున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానాన్ని స్వీకరించకుండా తన బదులుగా ఉపాధ్యక్షుడిని పంపించడం ఇదే తొలిసారి.