Page Loader
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిని టార్గెట్ చేసిన డ్రోన్ 
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిని టార్గెట్ చేసిన డ్రోన్

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిని టార్గెట్ చేసిన డ్రోన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజా కథనాల ప్రకారం, ఇజ్రాయెల్‌ (Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇంటి సమీపంలో డ్రోన్‌ దాడి జరిగిందని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, ఇజ్రాయెల్‌ హమాస్‌, హెజ్‌బొల్లా గ్రూప్‌లు అంతమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ సందర్భంగా, లెబనాన్‌ వైపు నుండి మూడు డ్రోన్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్‌ దళాలు వెల్లడించాయి. అందులో ఒక డ్రోన్‌ సిజేరియా ప్రాంతంలోని ఒక భవనాన్ని ఢీకొట్టినట్లు పేర్కొనగా, మిగతా రెండు డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో, నెతన్యాహు నివాసానికి సమీపంలో కూడా దాడి జరిగిందని వివిధ కథనాలు సూచిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెతన్యాహు నివాసాన్నిలక్ష్యంగా  లెబనాన్ డ్రోన్