అమెరికాలో డేంజర్ బెల్స్.. న్యూయార్క్ నగరాన్ని కప్పేసిన పొగ
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికాలో కాలుష్యం కారణంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
సంయుక్త రాష్ట్రాల్లోనే ప్రధానమైన న్యూయార్క్ నగరాన్ని పొగ కమ్మేస్తోంది. ఈ మేరకు మంగళవారం రికార్డు స్థాయిలో కాలుష్యం రికార్డ్ అయ్యింది.
దిల్లీని మించిన పొల్యూషన్ :
ఆసియా దేశాల్లోని ప్రధాన నగరాలు దిల్లీ, బాగ్ధాద్ కన్నా ఓ రేంజ్ లో అక్కడ ఏయిర్ పొల్యూషన్ నమోదైంది. పక్కనే ఉన్న కెనడాలో దావానలం చెలరేగింది. ఫలితంగానే న్యూయార్క్ లో ఆకాశాన్ని తాకే పొగ కప్పేస్తోంది.
దీంతో నగర వ్యాప్తంగా కాలుష్యం కోరలు చాస్తూ గంట గంటకూ అనారోగ్య స్థితికి దిగజారుతోంది.
న్యూయార్క్‌తో పాటు అమెరికాలోని ఇతర నగరాలు స్మోక్ పొల్యూషన్ తో ఇబ్బందిపతున్నాయి. అటు డెట్రాయిట్ నగరంలోనూ కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
Forest Fires In Canada Creates High Pollution To NewYork
బయటకెళ్లొద్దని న్యూయార్క్ వాసులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ
న్యూయార్క్‌లో కాలుష్యం అతితీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఔట్ డోర్ కార్యక్రమాలను వెంటనే రద్దు చేసుకోవాలని సూచించింది.
మంగళవారం రాత్రి 1.05 నిమిషాల సమయంలో న్యూయార్క్‌లో పొల్యూషన్ ఇండెక్స్ 0 - 500 మధ్య ఉందని అంచనా వేశారు. ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరీ అనారోగ్యకరంగా ఉన్నట్లు గుర్తించారు.
దీనంతటికి కారణం కెనడాలో మొదలైన కార్చిచ్చే. అంతకంతకూ అడువులు అంటుకుంటూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి.
ఇప్పటికీ 3.3 మిలియన్ల హెక్టార్లలో అటవీ కాలి బూడిదైనట్లు కెనడా అధికారులు వెల్లడించారు. మొత్తంగా 413 చోట్ల కార్చిచ్చు ఘటనలు నమోదు అయ్యాయని, దీని కారణంగా 26 వేల మంది కెనడియన్లను సేఫ్ జోన్లకు తరలించామన్నారు.