LOADING...
Greta Thunberg-Trump: గ్రెటాకు కోపం ఎక్కువ.. శిక్షణ అవసరం: డొనాల్డ్ ట్రంప్ 
గ్రెటాకు కోపం ఎక్కువ.. శిక్షణ అవసరం: డొనాల్డ్ ట్రంప్

Greta Thunberg-Trump: గ్రెటాకు కోపం ఎక్కువ.. శిక్షణ అవసరం: డొనాల్డ్ ట్రంప్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ సైన్యం మానవతా సాయం కోసం వెళ్లిన మేడ్లిన్‌ నౌకను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుని, అందులో ఉన్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై గ్రెటా తీవ్రంగా స్పందిస్తూ.. 'ఇజ్రాయెల్‌ దళాలు మమ్మల్ని కిడ్నాప్‌ చేశాయని ఆరోపించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఆమెపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఆమె చాలా వింత వ్యక్తి. చిన్న పిల్లగానే కనిపిస్తోంది. ఆమెకు నిజంగా కోపమొస్తుందా లేదా కూడా అర్థం కావడం లేదు. కోపం తగ్గించుకోవాలంటే స్పెషల్ క్లాసులకు హాజరుకావాలని సూచిస్తున్నాను. ఇజ్రాయెల్ సైన్యానికి ఇప్పటికే చాలాసార్లు తలనొప్పులు ఎదురవుతున్నాయని ట్రంప్‌ ఎద్దేవా చేశారు.

Details

చింతపర్తి

ఈ ఘటన ఫ్రీడమ్‌ ఫ్లొటిల్లా అలెయన్స్‌ అనే సంస్థ చేపట్టిన మిషన్‌లో భాగంగా చోటుచేసుకుంది. బ్రిటిష్ జెండాతో ఉన్న మేడ్లిన్‌ నౌక జూన్ 6న ఇటలీకి చెందిన సిసిలీ నుంచి బయల్దేరింది. గ్రెటా థన్‌బర్గ్‌తో పాటు యూరోపియన్‌ పార్లమెంట్ సభ్యురాలు రీమా హసన్‌ సహా మొత్తం 12 మంది ఈ యాత్రలో భాగమయ్యారు. గాజాలో పౌరులకు అవసరమైన ఆహారం, బేబీ ఫార్ములా వంటి సహాయక సామగ్రిని తీసుకెళ్తూ మానవతా సహాయం అందించేందుకు ప్రయాణించారు. అయితే గాజా చుట్టూ విధించిన ఆంక్షల నేపథ్యంలో, ఈ నౌకను సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. తర్వాత దాన్ని తమ నియంత్రణలోని పోర్టుకు తరలించింది.

Details

ఆహారం, మందులు స్వాధీనం చేసుకున్నారు

దీనిపై ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ - ఇది మానవతా సహాయక యాత్ర కాదు. సెలబ్రిటీల కోసం సదరు నౌక నడిపిన సెల్ఫీ షో మాత్రమే అని విమర్శించింది. నౌకలో తక్కువ మొత్తంలోనే ఆహార పదార్థాలున్నాయని పేర్కొంది. షో ముగిసిందని ధ్వజమెత్తింది. ఇక ఫ్రీడమ్‌ ఫ్లొటిల్లా అలెయన్స్‌ మాత్రం దీనిపై భిన్నంగా స్పందించింది. 'ఇజ్రాయెల్ కమాండోలు అక్రమంగా నౌకలోకి చొరబడి, నిస్సహాయులైన మనుషులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నౌకలో ఉన్న ఆహారం, మందులు, అత్యవసర వస్తువులను స్వాధీనం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైందిగా, గ్రెటా థన్‌బర్గ్ అరెస్ట్‌ చుట్టూ మళ్లీ పశ్చిమ ఆసియా విభేదాలకు మానవహక్కుల కోణం జత కలిసినట్లైంది.