HAMAS : హమాస్‌పై భారత ఇంటెలిజెన్స్ కీలక వ్యాఖ్యలు.. ఇజ్రాయెల్ పై దాడిని జిహాద్ విజయంగా జరుపుకోవడంపై ఆందోళన
గాజా ఉగ్రవాద సంస్థ హమాస్‌పై భారత్ స్పందించింది. ఈ మేరకు దేశంలో హమాస్ మిలిటెంట్ సంస్థను నిషేధించే యోచన లేదని ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 హమాస్ దాడిని "జిహాద్ విజయం"గా జరుపుకోవడం పట్ల భద్రతా దళాలకు ఆందోళన కలిగించే సంకేతాలని భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. జిహాద్ ప్రతీకార చర్యలు వంటివన్నీ భద్రతా సిబ్బందికి, దళాలలకు ఆందోళన కలిగించే విషయాలని వివరించాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య, అమాయక పౌరులపై హమాస్ దాడికి మధ్య గల తేడాలను ఎక్కువ మంది భారతీయ ముస్లింలు గుర్తించలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా పాలస్తీనాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గుర్తించకుండానే ముస్లింలు దీన్ని విజయంగా చూస్తున్నారని వివరించాయి.
భారత్ లో రాడికలైజ్డ్ కాశ్మీరీ మిలిటెంట్లు భారీ సంఖ్యలో ఉన్నారన్న నిఘా వర్గాలు
ఈ మేరకు భారతదేశం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. ముస్లిం మతపెద్దలు ఈ సమస్యపై ప్రస్తుతం మౌనం వహిస్తున్నాయి. ఏజెన్సీలకు ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే, ఇజ్రాయెల్‌లో దాడి బయటి నుంచి జరిగింది, కానీ భారతదేశంలో,ఈ రకమైన దాడి పునరావృతమైతే, అది లోపల నుంచే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మన వద్ద ఇప్పటికే పాకిస్థానీ ఆయుధాలతో రాడికలైజ్డ్ కాశ్మీరీ మిలిటెంట్లు భారీ సంఖ్యలో ఉన్నారన్న ఇంటెలిజెన్స్, ఇటీవలే, పాలస్తీనా శ్రేయస్సు కోసం వివిధ మసీదు ప్రార్థనలు కూడా జరిగాయని గుర్తు చేశాయి. భారత్ సాధారణంగా అనుసరించే ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో హమాస్ లేదు. ఫలితంగా హమాస్‌ను నిషేధించే ఆలోచన భారత ప్రభుత్వానికి లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.