
Kamala harris: అమెరికాకు అధ్యక్షురాలిగా ఎన్నికైతే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవను: కమలా హారిస్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో ఉన్నారు.
ఈ సందర్భంగా ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.తను విజయం సాధించినా, రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల భాగంగా పుతిన్‌ను కలవబోనని ఆమె ప్రకటించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో,పుతిన్‌ను కలుస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
"ఉక్రెయిన్ లేకుండా ద్వైపాక్షిక చర్చలు ఉండవు.ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఆ దేశమే నిర్ణయం తీసుకోవాలి"అని ఆమె స్పష్టం చేశారు.
అలాగే,ఉక్రెయిన్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఆమె ఎద్దేవా చేశారు."ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే,పుతిన్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కైవ్‌ను అధిగమించేవాడు"అని ఆమె తెలిపారు.
వివరాలు
ట్రంప్ అధ్యక్షుడయ్యే వరకు వెన్నంటే ఉంటా..
అమెరికాలో వచ్చే నెలలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే వరకు తాను ఆయన వెన్నంటే ఉంటానని మస్క్ తెలిపారు. టకర్ కార్లసన్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయమై వ్యాఖ్యానించారు.
వివరాలు
ట్రంప్ గెలవకపోతే ఇది అమెరికాలో చివరి ఎన్నికలు: మస్క్
మస్క్ అభిప్రాయాన ప్రకారం, ట్రంప్ గెలవకపోతే ఇది అమెరికాలో చివరి ఎన్నికలు కావచ్చు.
డెమోక్రాట్ పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలో ఆవిర్భవించిన కీలకమైన వలసదారుల అంశంపై ఆయన స్పందిస్తూ, ఉద్దేశపూర్వకంగా వారిని కొన్ని కీలక రాష్ట్రాలకు తరలిస్తున్నారని నమ్ముతున్నట్టు తెలిపారు.
వారికి పౌరసత్వం కల్పిస్తే, వారు డెమోక్రట్ల ఓటర్లుగా మారుతారని మస్క్ విమర్శించారు.
డెమోక్రట్లు మరో నాలుగేళ్లు అమెరికాను పాలిస్తే, చట్ట విరుద్ధమైన చర్యలు చేపడతారని పేర్కొన్నారు.
ఈ చర్యల ఫలితంగా స్వింగ్ స్టేట్స్ మాయమవుతాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.