
JeM Chief Warning PM Modi: భారత ప్రధాని మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేసిన మసూద్ అజహర్..
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైంది.
ఈ ఆపరేషన్‌లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌కు చెందిన బహావల్పూర్ కేంద్ర స్థావరం పూర్తిగా ధ్వంసమైపోయింది.
భారత సైన్యం చేపట్టిన ఈ తీవ్ర చర్యతో జైషే మహమ్మద్ ఆధారిత మిలిటెంట్ల స్థావరం పూర్తిగా మట్టిబారింది.
తాజా సమాచారం ప్రకారం, మసూద్ అజహర్ కుటుంబానికి చెందిన సుమారు 14 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
మరణించిన వారిలో మసూద్ సోదరి, బావమరిది, మేనల్లుడు ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
భారత్‌పై ప్రతీకారం.. ప్రణాళికలు సిద్ధం
ఈ ఘటన అనంతరం మసూద్ అజహర్ ఒక లేఖను విడుదల చేశాడు.
అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
మోదీ యుద్ధ నిబంధనలన్నిటినీ ఉల్లంఘించారని ఆరోపించాడు.
తనకు భయం లేదని, నిరాశ లేకపోయినప్పటికీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
లేఖలో ఆయన భారత్‌ను నాశనం చేస్తానని, ప్రధాని మోదీకి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించాడు.
భారత్‌పై ప్రతీకారం తీసుకోవడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నానని మసూద్ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధాని మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేసిన మసూద్ అజహర్..
India Has Broken All Bounds, Expect No Mercy Now: Masood Azhar. Read Full Story: https://t.co/MnGzpEoz1o#PakistanArmy #PakistanZindabad #PakistanStrikesBack #Pakistani #IndiaPakistanWar #OperationSindoor #IndiaPakistanWar #IndianArmy #IndiaPakistanTensions… pic.twitter.com/6NFRUoVGeP
— Photo News (@PhotoNewsPk) May 7, 2025